దర్శకుడిగా తొలిగా చేసిన ప్రయత్నంతోనే మంచి మార్కులు పొందారు ‘బాణం’ డైరెక్టర్ చైతన్య దంతులూరి. నారా రోహిత్ ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన నాలుగేళ్ల క్రిందట రూపొందించిన ‘బాణం’. అప్పట్లో విమర్శకుల ప్రశంసలను పొందడమే కాదు. ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని సైతం సొంతం చేసుకుంది.
ఇప్పుడీ దర్శకుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ‘బసంతి’ అనే పేరుతో ద్వితీయ ప్రయత్నాన్ని చేస్తున్నారు. కళాశాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి. ‘బాణం’ కి మంచి స్వరాలు అందించిన మణిశర్మనే సంగీత మందిస్తున్నారు. అలీషా బేగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వైవిధ్యభరితంగా తెరకెక్కిందని చైతన్య చెప్పుకొస్తున్నారు.
‘బాణం’ కి, ‘బసంతి’ కి అస్సలు సంబంధం ఉండదని చెబుతున్నారు. ‘బాణం’ చిత్రీకరణని హైదరాబాద్ లో అస్సలు జరపకోవడం ఒకలాంటి అనుభూతినిస్తే. ‘బసంతి’ ని పూర్తిగా హైదరాబాద్ లోనే షూట్ చేయడంతో మరోలా అనుభూతిని పొందానని చెప్పుకొస్తున్నారు సదరు దర్శకుడు. మంచి ప్రయత్నంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న చైతన్య. ఈ సారి కచ్చితంగా మునుపటి కంటే మెరుగైన ఫలితం పొందుతారని చిత్రయూనిట్ పేర్కొంటోంది.
JioHotstar has officially confirmed that The Raja Saab will make its digital debut on the…
The filming of 'Karate Babu', the highly anticipated collaboration between leading Tamil actor Jayam Ravi…
Rashmika Mandanna, who has consistently earned praise for her performances across languages, is set to…
Veteran actor and Padma Shri awardee Dr. Rajendra Prasad paid a courtesy visit to Andhra…
Megastar Chiranjeevi has once again proved his unrivalled box office stamina as Mana Shankara Vara…
Mega Power Star Ram Charan’s highly anticipated ambitious pan-India sports-action drama Peddi, directed by Buchi…