టాలీవుడ్ హీరోలకు కలసిరాని గెటప్పులు ఇవే!

హీరోలు కొత్త గెటప్ ట్రై చేసినప్పటికీ నిరాశపరిచిన చిత్రాల జాబితా ఇదే.

పవన్ కళ్యాణ్ - కొమరం పులి

పవన్ తన కెరీర్ లో ట్రై చేసిన విభిన్నమైన గెటప్స్ లో కొమరం పులి కూడా ఒకటి. కానీ ఆ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది

మహేష్ బాబు - అతిథి

అతిథి చిత్రంలో మహేష్ హేర్ స్టైల్ వెరైటీగా ఉంటుంది. అప్పట్లో ఆ గెటప్ సినిమాపై హైప్ తీసుకువచ్చింది. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది.

ఎన్టీఆర్ - శక్తి

ఎన్టీఆర్ శక్తి చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో లాంగ్ హేర్ తో కొత్త గెటప్ ట్రై చేశారు. ఆ లుక్ ఎన్టీఆర్ కి సెట్ కాలేదు.

అల్లు అర్జున్ - వేదం

క్రిష్ తెరకెక్కించిన వేదం చిత్రంలో బన్నీ సాఫ్ట్ హేర్ తో కాస్త డిఫెరెంట్ గా కనిపించాడు. బాక్సాఫీస్ పరంగా వేదం నిరాశపరిచింది.

బాలకృష్ణ - ఒక్కమగాడు

భారీ అంచనాల నడుమ 2008లో విడుదలైన చిత్రం ఒక్క మగాడు. ఈ మూవీలో బాలయ్య ట్రై చేసిన వృద్ధుడి పాత్ర ఆకట్టుకోలేకపోయింది.

వెంకటేష్ - షాడో

షాడో మూవీలో వెంకీ లాంగ్ హేర్ తో కనిపించారు. ఆ లుక్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

నాని - జెండాపై కపిరాజు

జెండాపై కపిరాజు చిత్రంలో నాని అడ్డనామాలు, షార్ట్ హేర్, కోరమీసాలతో కనిపించాడు.

రానా - అరణ్య

రానా చివరగా నటించిన చిత్రం అరణ్య. ఈ చిత్రంలో అడవి మనిషి తరహాలో రానా కరికొత్త గెటప్ ట్రై చేశాడు.