టాలీవుడ్ హీరోయిన్లు తమ బెస్ట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న చిత్రాలు ఇవే.
బాహుబలి ఉన్నప్పటికీ అనుష్క పెర్ఫామెన్స్ పరంగా అరుంధతి చిత్రం ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది.
సాయిపల్లవి తన నటనతో ఫిదా చేసేసింది. ఈ చిత్రం నుంచే సాయిపల్లవి హవా టాలీవుడ్ లో మొదలయింది.
కాజల్ కెరీర్ లో నటనకు స్కోప్ ఉన్న రోల్స్ తక్కువ. కాజల్ యాక్టింగ్ పరంగా నేనే రాజు నేనే మంత్రి చిత్రం హైలైట్ అని చెప్పొచ్చు.
నయనతార బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో ఐఏఎస్ అధికారిగా నటించిన కర్తవ్యం చిత్రం ఉత్తమం.
జెనీలియా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చిన చిత్రం బొమ్మరిల్లు. ఆమె కెరీర్ లో బెస్ట్ మూవీ ఇదే.
కళ్ళతోనే హావభావాలు పలికించగల నటి నిత్యామీనన్. గుండెజారి గల్లంతయ్యిందేలో నిత్యా నటన మెస్మరైజింగ్ గా ఉంటుంది.
పూర్తి స్థాయి నటన బయటకు వచ్చేది నెగిటివ్ రోల్ లోనే. 'ఎవరు' చిత్రంలో రెజీనా తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది.
ఈ చిత్రం గురించి చెప్పేదేముంది. జాతీయ అవార్డే కీర్తి సురేష్ కు దాసోహమైంది.
నివేద థామస్ కు నటనకు స్కోప్ ఉన్న రోల్ పడితే ఎలా ఉంటుంది.. వకీల్ సాబ్ లాగా ఉంటుంది.
సమంత తన కెరీర్ లో అ..ఆ.., ఓ బేబీ లాంటి అద్భుతమైన రోల్స్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమె నటన వేరే లెవల్.