ఇదేం ఖర్మరా బాబూ... మత పిచ్చితో జొమాటో ఆర్డర్ రద్దు!
Send us your feedback to audioarticles@vaarta.com
నిజంగా ఈ వార్త చదివిన తర్వాత ఎంత పిచ్చోడ్రా బాబూ.. అనుకోక తప్పదు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో ఇంటి ముందే అన్నీ వచ్చి వాలిపోతున్నాయ్.. అది ఫుడ్ అయినా బెడ్ అయినా..! అయితే తాజాగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో పా అమిత్ షా అనే వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. ఫుడ్ డెలివరీ బాయ్ హిందూయేతరుడు కావడంతో ఆర్డర్లో ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేసి బాయ్‌ను మార్చమని అడిగాడు. అయితే ఇందుకు స్పందించిన జొమాటో డెలివరీ బాయ్‌ను మార్చే సమస్యే లేదు.. మీరు చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వమని తేల్చిచెప్పేసింది. దీంతో ఖంగుతున్న శుక్లా వెంటనే తన ఆర్డర్ రద్దు చేసి.. తనకు రీఫండ్ చేయనక్కర్లేదని చెప్పేశాడు. అంతేకాదు.. మళ్లీ మళ్లీ ఇలానే ఆర్డర్ చేసుకుంటే హిందుయేతరులే డెలివరీ చేస్తారనుకున్నాడేమో కానీ.. వెంటనే జొమాటో యాప్‌నే తన ఫోన్ నుంచి తీసేసినట్లు ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
ఇదిగో ఈ ఘనకార్యం ఎక్కడో కాదండోయ్ జరిగింది.. మన హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా శుక్లా చేసిన ఈ ట్వీట్‌ను చూసిన పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఎవరైతే ఏముంది బాబాయ్.. ఆర్డర్ చేస్తున్నావ్.. తెచ్చిస్తున్నారంతేగా ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావంటూ కన్నెర్రజేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆ మధ్య బెంగళూరులో ఓలా క్యాబ్ డ్రైవర్ హిందువు కాదని ఓ వ్యక్తి తన రైడ్‌ను రద్దు చేసిన వ్యవహారం అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం విదితమే. కాగా.. దేశంలో బీజేపీ పాలన కారణంగానో లేక మరేమైనా కారణాలున్నాయో తెలియట్లేదు కానీ ఈ మధ్య కొంత మందిలో మతపిచ్చి అనేది పీక్కు వెళ్లింది. మూఢ మతతత్వంతో తామేం చేస్తున్నామో ఎరుగక ఇష్టారీత్యా వ్యవహరిస్తూ ఇలా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే మున్ముంథు ఇలాంటి వ్యవహారాలు మరెన్ని చూడాలో ఏంటో..! కులమతాలు ఒక్క పూట కూడా భోజనం పెట్టవన్న విషయం తెలుసుకుంటే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout