జికా వైరస్ సోకిన మహిళకు మగబిడ్డ.. కేరళలో తొలి కేసు, లక్షణాలు ఇవే!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఇది చాలదు అన్నట్లు దేశంలో తొలి జికా వైరస్ కేసు కేరళలో నమోదైంది. 24 ఏళ్ల మహిళకు జికా వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె వ్యాధి లక్షణాలని, మహిళ ఆరోగ్య పరిస్థితిని వివరించారు.
పరసాలకు చెందిన 24 ఏళ్ల గర్భవతి మహిళ జూన్ 28న జ్వరంతో భాదపడుతూ తిరువనంతపురంలోని ఆసుపత్రిలో చేరింది. ఆమె నమూనాలని పూణేకి పంపించగా జికా వైరస్ అని తేలింది. దీనితో దానికి తగ్గట్లుగా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం రోజు ఆ మహిళ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తిరువనంతపురం నుంచి మరో 19 నమూనాలని సేకరించి పరీక్షల కోసం పూణేలోని జాతీయ వైరాలజి సంస్థ ల్యాబ్ కు పంపించామని మంత్రి తెలిపారు. వారిలో 13 మందికి వైరస్ లక్షణాలు ఉన్నాయని.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం అని అన్నారు.
అయితే సదరు మహిళ తల్లికి కూడా ఇదే తరహా లక్షణాలు వారం క్రితం కనిపించాయి అని మంత్రి అన్నారు. జికా వైరస్ లక్షణాలు కూడా డెంగీ వ్యాధి తరహాలోనే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, చర్మంపై ఎర్ర మచ్చలు ఉంటాయి. ఈ వ్యాధి దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది.
ఎక్కువమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించవట. కానీ బయట పడ్డ వారిలో జ్వరం తరహా లక్షణాలు ఉంటాయని అంటున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదకరమే అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments