ZEE5 'పులి-మేక' పేరుతో కొత్త వెబ్ సిరీస్‌ ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,June 18 2022]

ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తుంది..ZEE5 ప్రారంభం నుండి ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ZEE5 కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది..ZEE5 ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్‌లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి 'లూజర్ 2', BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి 'గాలివాన' , ఇటీవల 'రెక్కీ 'తో ZEE5 మంచి హిట్ ను అందుకుంది .ఇప్పుడు తాజాగా పులి - మేక వెబ్ సిరీస్ ను లాంచ్ చేసింది ZEE5.

ZEE5 అసోసియేషన్ విత్ కోన ఫిలిం కార్పోరేషన్ , చేస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ “పులి - మేక”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటించడం విశేషం. గోపీచంద్ హీరో గా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ & ZEE5 వారు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశం తో తెరకెక్కిస్తున్న 'పులి - మేక ’ వెబ్ సిరీస్ పూజ కార్యక్ర మాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.

పూజ కార్యక్రమాల అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా సినిమాల తో పోటీ పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా వెబ్ సిరీస్ లకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ పులి - మేక వెబ్ సిరీస్ లలో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పులి - మేక వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే పోలీసు డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది . పోలీస్ డిపార్టుమెంట్ లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరు చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు మరియు ఆస్ట్రాలజీ తో మిళితమైన కథాంశం ఉండటం ఈ వెబ్ సిరీస్ కథలో ఉన్న ప్రత్యేకత ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లాగే ఇది కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

More News

Chor Bazar: చోర్ బజార్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది - నిర్మాత వీఎస్ రాజు

ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా చోర్ బజార్ చిత్రాన్ని నిర్మించారు వీఎస్ రాజు.

హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే సందర్బంగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన 'శశివదనే' టీం

యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’.

agnipath :  13 వాట్సాప్ గ్రూప్‌లతో రెచ్చగొట్టి.. పోలీసుల అదుపులో ‘‘సికింద్రాబాద్ అల్లర్ల’’ సూత్రధారి

సాయుధ బలగాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా యువత, ప్రజా సంఘాలు, ఆర్మీ ఉద్యోగార్ధులు

Dallas: డాలస్ లో అధ్బుతంగా ఆకట్టుకున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) సయ్యంది పాదం డాన్స్ పోటీలు

జులై  1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ డి.సి లో జరుగనున్న 17వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో

Pawan kalyan: సికింద్రాబాద్ అల్లర్లు, బాసర విద్యార్ధుల సమస్యలపై పవన్ కళ్యాన్ స్పందన

భారత సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో