‘ప్రేమ ఎంత మధురం’ అనే సరికొత్త సీరియల్‌తో మన ముందుకు రాబోతున్న జీ తెలుగు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమ ప్రేమని మాత్రమే కోరుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు లాంటి పట్టింపులు ఉండవు. అలాగే స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించిన సీరియల్ ప్రేమ ఎంత మధురం. 40 ఏళ్ల డైనమిక్ బిజినెస్‌మ్యాన్ ఆర్యవర్థన్. అతనికి బిజినెస్, కుటుంబం తప్ప మరో వ్యాపకం లేదు. మరోవైపు అను. వయసు 19 సంవత్సరాలు. ఎప్పుడు ఆడుతు, పాడుతూ ఉండే చలాకీ పిల్ల. తన చిన్న ప్రపంచమే ఆమెకు లోకం. ఆర్యవర్థన్, అను.. విభిన్న మనస్తత్వాలు కలిగిన వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, వీరి ప్రేమకు వయస్సు అడ్డంకి కాలేదా, అసలు వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి? ఇదే కాన్సెప్ట్‌తో జీ తెలుగు ద్వారా మీ ముందుకు రాబోతుంది ప్రేమ ఎంత మధురం సీరియల్.
జీ తెలుగు ఛానెల్ బ్రాండ్ ఫిలాసఫీ ఒక్కటే.. ‘ఆరంభం ఒక అడుగుతోనే’. ఈ సూత్రాన్ని అనునిత్యం ఆచరిస్తూ అద్భుతమైన కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇప్పుడు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ ప్రేమ ఎంత మధురం సీరియల్‌తో మీ ముందుకు వస్తోంది జీ తెలుగు. స్వచ్చమైన ప్రేమలో ఉన్న ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమని గెలిపించుకోవడానికి ఈ సమాజం అనుమతి తీసుకోవాలా? ఇదే కథాంశంగా రూపొందింది ప్రేమ ఎంత మధురం. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందించిన ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫిబ్రవరి 10, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీ ఛానెల్స్‌లో ప్రసారం కానుంది.
సీరియల్స్ అన్నీ ఒకేలా ఉండవు. ప్రేమ ఎంత మధురం కూడా అలాంటిదే. ఈ సీరియల్‌ని అత్యుత్తమమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రూపొందించారు. ఈ సీరియల్ టైటిల్ సాంగ్‌ని కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. దీంతో.. ప్రేక్షకులు ఈ పాటని తమ కాలర్ ట్యూన్‌గా పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే.. తొలిసారిగా ఒక సీరియల్ కాలర్ ట్యూన్ ఇప్పుడు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా , బీఎస్ఎన్ఎల్లో అభిమాన ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంది. త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ ట్యూన్ అందుబాటులోకి రాబోతుంది.
ఒక విలక్షణమైన వీడియో కాన్సెప్ట్ కోసం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు జీ తెలుగుతో చేతులు కలిపారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ ఆర్టిస్టుల్ని ఈ వీడియో ద్వారా పరిచయం చేసిన మహేశ్.. సీరియల్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు తనదైన స్టైల్లో వివరించారు. ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఈ వీడియోలో సూపర్‌స్టార్ మహేశ్‌తో కన్పించాడు. ఇప్పుడు ఈ వీడియో టీవీల్లో, సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ ప్రసారం అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులు ప్రతీ ఒక్కరూ జీ తెలుగుని అద్భుతం అని పొగుడుతున్నారు.
ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ నటీనటుల విషయానికి వస్తే.. ఆర్య వర్థన్ పాత్రలో వెంకట్ శ్రీరామ్ నటించగా, అను కేరక్టర్లో వర్ష హెచ్‌కె నటించింది. హైదరాబాద్ నేపథ్యంలో జరిగే ఈ కథలో రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కలిగిన ఆర్యవర్థన్, అను మధ్య పుట్టిన ప్రేమే అసలు కథాంశం. అయితే.. ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదు వయసు రీత్యా కూడా ఎంతో వ్యత్యాసం ఉన్న వీరిద్దరి ప్రేమను సమాజం ఒప్పుకుంటుందా, తమకున్న అడ్డంకుల్ని దాటుకుని తమ ప్రేమని వీరిద్దరూ ఎలా గెల్చుకున్నారు? అనేదే అసలు కథ.
ప్రేమ ఎంత మధురం సీరియల్లో తన పాత్ర, దాని తీరుతెన్నులు గురించి వెంకట్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఆర్యవర్థన్ కేరక్టర్ నేను ఇంతవరకు చేయలేదు. నాకు ఈ పాత్ర చాలా కొత్తగా ఉంది. ఈ కేరక్టర్ ద్వారా ప్రేక్షకులు నన్ను మరోసారి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.”
ఇక వర్ష హెచ్‌కె మాట్లాడుతూ.. “అను పాత్ర నా మనసుకి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా, ఈ పాత్ర ద్వారా నన్ను నేను నిరూపించుకునే అవకాశం దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు కూడా నా పాత్ర నచ్చుతుందని ఆశిస్తున్నాను.”
కథ ముందుకు వెళ్తున్నకొద్దీ ఈ సీరియల్లో ఎన్నో అద్భుతమైన ట్విస్ట్‌లు ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. తమకున్న అడ్డంకుల్ని దాటుకుని ఆర్యవర్థన్, అను తమ ప్రేమని గెలిపించుకుంటారా? తమకొచ్చిన సమస్యల్ని వీరిద్దరూ ఎలా ఫేస్ చేయబోతున్నారు?. లాంటి ఆసక్తికర పరిణామాల్ని తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్‌ని ప్రతీ రోజూ చూడాల్సిందే.
ఎలాంటి స్వార్థాన్ని కోరుకోని ప్రేమ.. ఆర్యవర్థన్, అను ప్రేమని గెలిపిస్తుందా.. ప్రేమ ఎంత మధురం.. ఫిబ్రవరి 10, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీ చానెల్స్‌లో. సో.. డోంట్ మిస్ ఇట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments