ఆడపడుచుల కోసం ‘నంబర్-1 కోడలు’ను తెస్తున్న జీ తెలుగు!
- IndiaGlitz, [Tuesday,December 03 2019]
జీ తెలుగు తన సీరియల్స్‌లో మహిళల్ని ఎంత ఉన్నతంగా, బలంగా చూపిస్తోందనే విషయం.. ఛానెల్లో ప్రసారమౌతున్న ‘సూర్యకాంతం’, ‘రామసక్కని సీత’, ‘రాథమ్మ కూతురు’ చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది. సమాజంలో మహిళలను మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా, మహిళల్ని ఎల్లప్పుడూ పాజిటివ్ రోల్స్‌లో జీ-తెలుగు చూపిస్తూ వస్తోంది. ఇప్పుడీ ఛానెల్ నుంచి మరో సరికొత్త ఆవిష్కరణ ‘నంబర్-1 కోడలు’. అత్తాకోడళ్ల మధ్య అనుబంధాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని విధంగా చూపించబోతోంది ‘నంబర్-1 కోడలు’. విభిన్నమైన కథాంశం, పవర్ ఫుల్ డ్రామా, ఆకట్టుకునే ట్విస్ట్ లతో కూడిన ఈ సీరియల్ డిసెంబర్ 9 నుంచి ప్రసారం అవుతుంది. ప్రతి సోమవారం - శనివారం, రాత్రి 8 గంటలకు ప్రసారమౌతుంది. ఈ అద్భుతమైన సీరియల్‌ను మీ జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో చూసి ఆనందించండని ఓ ప్రకటనలో తెలిపింది.
కథ సారాంశం ఇదీ..!
కాగా.. ఈ సీరియల్లో 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెటరన్ నటి సుధా చంద్రన్, వాగ్దేవి పాత్రతో.. తెలుగు స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈమెకు కోడలిగా సరస్వతి పాత్రలో అందమైన నటి మధుమిత నటిస్తోంది. రెండు భిన్నమైన ప్రపంచాలకు చెందిన ఇద్దరు మహిళల మనస్తత్వాల్ని ఈ షో చూపించబోతోంది. ఎన్నో విద్యాసంస్థల్ని నడిపే వ్యాపారవేత్త వాగ్దేవి. జీవితంలో విజయం సాధించాలంటే విద్య చాలా అవసరం అని నమ్ముతుంది వాగ్దేవి కుటుంబం. కోడలు సరస్వతి రాకతో వాగ్దేవి జీవితం ఎలా మారింది, నిరక్షరాస్యురాలైన సరస్వతి, వాగ్దేవిని ఎలా మార్చింది.. ఆమెకు అసలైన ప్రేమ-ఆనందాన్ని ఎలా రుచిచూపించింది అనేది ఈ షోను నడిపించే ప్రధానమైన అంశం. సుధాచంద్రన్, మధుమిత పాత్రలతో పాటు నంబర్-1 కోడలు షోలో జై ధనుష్, సురేష్, క్రాంతి, రితి, సాక్షి శివ, చలపతి రాజా లాంటి బలమైన నటీనటులున్నారు.