జీ తెలుగు కొత్త సీరియల్స్ నిండు నూరేళ్ల సావాసం, జగద్దాత్రికి తిరుగులేని ఆదరణ.. టాప్ లేపుతోన్న టీఆర్పీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగువారికి అసలైన వినోదాన్ని అందిస్తూ దూసుకెళ్తోంది. మహిళామణులు మెచ్చే త్రినయని, ప్రేమ ఎంత మధురం, పడమటి సంధ్యా రాగం సీరియల్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఇటీవల ప్రారంభమైన నిండు నూరేళ్ల సావాసం, జగద్ధాత్రి సీరియల్స్ అంచనాలను మించి ఆదరణ పొందుతున్నాయి. ఓ ఆర్మీ మేజర్ కుటుంబ కథతో సాగే ఈ సీరియల్ .. ప్రేమ, ఆప్యాయత కలబోతగా ఆసక్తికర మలుపులతో సాగుతోంది. ఈ సీరియల్లో అమర్, అరుంధతి, భాగమతి , మనోహరి ప్రధాన పాత్రలు. అరుంధతి చనిపోవడంతో అమర్ జీవితంలో ప్రవేశించిన మనోహర్ చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది.
ఆత్మగా మారిన అరుంధతికి తన మరణం వెనక ఉన్న మిస్టరీ తెలిసిపోతుందా? భాగమతిని పిల్లలు తల్లి స్థానంలో అంగీకరిస్తారా? అమర్‌ను దక్కించుకోవడానికి మనోహరి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతోంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే. ఈ సీరియల్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతూ వుండటంతో నిండు నూరేళ్ల సావాసం నటీనటులు ప్రేక్షకులతో కలిసి సిద్ధిపేటలో శ్రావణమాసం వరలక్ష్మీ వత్రాన్ని కూడా నిర్వహించారు.
ఇక జగద్ధాత్రి విషయానికి వస్తే.. అమాయకంగా, సాధారణ ఆడపిల్లలా కనిపించే జగద్ధాత్రి ఐపీఎస్ ఆఫీసర్‌గా నేరస్తుల అంతు చూస్తూ వుంటుంది. ధాత్రి వృత్తిగత జీవితంలో ఆమెకు కేదార్ అండగా నిలబడతాడు. కానీ కేదార్ తండ్రి ఎవరో తెలియకపోవడంతో సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కొంటాడు. మరోవైపు కౌశికి తన కుటుంబంలో జరుగుతున్న కుట్రలను కనిపెట్టలేక అందరినీ నమ్ముతూ ఉంటుంది. ఇంతకీ కేదార్ తండ్రి ఎవరు? జగద్దాత్రి జీవితంలో ఎలాంటి అవరోధాలను ఎదుర్కోబోతోంది? కౌశికి కుటుంబ సభ్యుల అసలు స్వరూపాన్ని తెలుసుకుంటుందా? వంటి విషయాలు తెలియాలంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు ప్రసారమయ్యే జగద్దాత్రి సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.
అసలు సీరియల్ ప్రోమో ప్రారంభమైన నాటి నుంచే జగద్ధాత్రి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రజల నుంచి ఈ సీరియల్‌కి ఆదరణ ఓ రేంజ్లో వుంది. ఖమ్మంలో వెలిసిన జగద్ధాత్రి 40 అడుగుల కటౌట్ దీనికి నిదర్శనం. రానున్న రోజుల్లో జగద్దాత్రి, నిండు నూరేళ్ల సావాసం సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ, తిరుగులేని టీఆర్పీతో దూసుకెళ్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments