డిసెంబర్ 27తో ముగియనున్న జీ తెలుగు 'ముద్ద మందారం' సీరియల్
Send us your feedback to audioarticles@vaarta.com
గత అర దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది జీ తెలుగు ముద్ద మందారం సీరియల్. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ షోగా నిలవడమే కాకుండా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన ముద్ద మందారం సీరియల్ ఇప్పుడు ఎండింగ్‌కు వచ్చేసింది. హరిత, పవన్ సాయి, తనూజ గౌడ ప్రధాన పాత్రల్లో మెప్పించిన ముద్ద మందారం సీరియల్లో ఆఖరి ఎపిసోడ్ ఈ నెల 27న ప్రసారం కాబోతుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సీరియల్ ఐదేళ్ల క్రితం మొదలైంది. అద్భుతమైన కథ, అంతే అద్భుతమైన పాత్రలతో అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే అఖిలాండేశ్వరి, ఆమె పెద్ద కుమారుడు దేవా, పార్వతి మధ్య ప్రేమానురాగాలతో ముద్ద మందారం తెలుగు లోగిళ్లలో అంతులేని వినోదాన్ని అందించింది. రీసెంట్గా ఈ ఏడాది మొదట్లో 1500 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ముద్ద మందారం సీరియల్‌ని తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో తీశారంటే ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ముద్ద మందారం సీరియల్ మొదలైనప్పటి నుంచి తెలుగు మార్కెట్లో అతిపెద్ద ఫ్యాన్‌బేస్‌ని ఏర్పాటు చేసుకుంది. మరీ ముఖ్యంగా సౌందర్య, అభినందన్‌గా మళ్లీ పుట్టిన పార్వతి, దేవ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. అన్నింటికి మించి ఈ సీరియల్ నేటి తరం అమ్మలకు అద్భుతంగా నచ్చింది. కారణం.. ప్రతీ తల్లీ తన కొడుకుపై చూపించే ప్రేమని అఖిలాండేశ్వరి పాత్రలో చూసుకోవడమే.
సీరియల్ ముగింపు సందర్భంగా సౌందర్య పాత్రలో నటించి మెప్పించిన తనూజ గౌడ మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. ప్రతీ కథకు అందమైన, ఆనందమయమైన ముగింపు ఉంటుంది. మాక్కూడా అలాగే ఉంది. ముద్ద మందారం సీరియల్‌తో నా కల నిజమైంది. ఈ సీరియల్ మొదలై, మొదటి ప్రోమో పడిన దగ్గరనుంచి ఇప్పటివరకు నా ప్రయాణం అద్భుతం, అనిర్వచనీయం. ఈ సీరియల్ నాకెంతో గుర్తింపుని, అంతకుమించి ప్రేమని ఇచ్చింది. నేను ఈ సీరియల్ డైరెక్టర్‌కి ఒకసారి ఉత్తమ డైరెక్టర్‌గా అవార్డు అందించాను. అయన నిజంగా దానికి అర్హుడు. ఇప్పుడు ఈ సీరియల్ ముగింపు దశకు చేరుకోవడం ద్వారా నటీనటుల్ని, ఇతర సిబ్బందిని మిస్ అవుతున్నాను అని అన్నారు ఆమె.
ఈ సందర్భంగా తనూజ గౌడ కో-స్టార్ పవన్ సాయి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ.. 5 ఏళ్లు, 1580 ఎపిసోడ్స్.. అన్నింటికి మించి అంతులేని ప్రేమ… నాలో అంతులేని భావాల్ని కలిగిస్తున్నాయి. వాటిని ఆపడం చాలా కష్టం. నా వరకు నాకు ముద్ద మందారం ఆత్మీయ అనుబంధాల కలయిక మరియు ఈ సీరియల్‌తో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. అందరి తరపున నేను చెప్పదల్చుకుంది ఒక్కటే… ముద్దమందారం అద్భుతంగా రావడానికి ప్రతీ ఒక్కరం కష్టపడ్డాం. ఇందులో ఎవ్వరూ తక్కువ కాదు. మా ఈ ప్రయాణంలో మాకు సహకరించి, వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ నేను పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout