త్వరలో ప్రసారం కానున్న కొత్త సీరియల్స్‌ని మచిలీపట్నంలో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో గ్రాండ్‌గా లాంచ్ చేసిన జీ తెలుగు
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్నమైన కథ, కథనాలే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అలాంటి విభిన్నమైన కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందించడంలో అగ్రస్థానంలో ఉంటుంది జీ తెలుగు. అందులో భాగంగా సరికొత్త కథ, కథనాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథలతో పాటు.. అనునిత్యం మన సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా సీరియల్స్ నిర్మిస్తోంది. కంటెంట్ ఫస్ట్ అనే సూత్రాన్ని మొదటినుంచి నమ్ముతున్న జీ తెలుగు అద్భుతమైన కంటెంట్‌తో ప్రేక్షకుల్ని అన్నివేళలా ఎంటర్‌టైన్ చేస్తోంది.
అద్భుతమైన కథ, ఆ కథను రక్తి కట్టించే కథనాలే జీ తెలుగు సీరియల్స్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం. ఇప్పుడు కూడా అలాంటి కథ, కథనాలతో ఈ జనవరి నుంచి రెండు ఫిక్షన్ షోస్… ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర, సీరియల్స్‌ని ప్రారంభించబోతోంది. ఈ సందర్భంగా ప్రేమ ఎంత మధురం సీరియల్ టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేశారు. ఈ సాంగ్‌ని స్పెషల్‌గా కశ్మీర్‌లోని అద్భుతమైన లొకేషన్లలో పిక్చరైజ్ చేశారు. దీంతోపాటు.. ఇదే ఈవెంట్‌లో తూర్పు పడమర థీమ్ టీజర్‌ని కూడా లాంచ్ చేశారు. ఎనర్జిటిక్ ప్రదీప్ మాచిరాజు, శ్యామల ఈ కార్యక్రమానికి యాంకర్స్‌గా వ్యవహరించారు.
ప్రేమ ఎంత మధురం విషయానికి వస్తే… జీ మరాఠిలో తుల పహాటే రే పేరుతో ఈ సీరియల్‌ని తీశారు. ఆ తర్వాత దీన్ని కన్నడలో జోతే జోతేఅలి పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా సూపర్‌హిట్ అయ్యింది. దీంతో… ఇప్పుడు తెలుగులో ప్రేమ ఎంత మధురం పేరుతో రీమేక్ చేశారు. మనసున్న ప్రేమకి వయసుతో పనిలేదు , ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది, అసలు వారిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి గల కారణాలు, అందుకు ఎదురైన ఇబ్బందులు లాంటి అద్భుతమైన కథతో ఈ సీరియల్‌ని తెరకెక్కించారు. ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్‌ని కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో పిక్చరైజ్ చేశారు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 10.5 డిగ్రీలు ఉంటుంది. మంచు గడ్డగట్టే ఇలాంటి వాతావరణంలో వెంకట్ శ్రీరామ్ మరియు వర్ష హెచ్‌కే పై ఈ టైటిల్ సాంగ్‌ని తీశారు. ఇంత కఠినతరమైన వాతావరణంలో, కేవలం 10 గంటల్లో వ్యవధిలో ఒక పాటని తీయడం భారతీయ టెలివిజన్ చరిత్రలో ఇదే తొలిసారి.
ఇక తూర్పు పడమర సీరియల్ విషయానికి వస్తే.. ఇద్దరు అమ్మాయిలు జీవిత కథగా దీన్ని తీర్చిదిద్దారు. యుక్త వయసులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరూ విభిన్న మనస్తత్వం కలిగిన వాళ్లు. వాళ్లిద్దరూ తమ జీవితాన్ని చూసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అలాంటి వారిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, వారి జీవితంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంగా ఈ సీరియల్‌ని తెరకెక్కించారు. ఇద్దరు అమ్మాయిలుగా యామిని, జయ కవి నటించారు. ముత్యాల ముగ్గు, మీనాక్షి సీరియల్స్ తర్వాత యామిని ఈ సీరియల్‌తో మరోసారి జీ తెలుగు ప్రేక్షకుల ముందుకు కాబోతుంది. ఇక యామినికి జంటగా ప్రణయ్ నటిస్తే. జయ కవికి జంటగా వినయ్ కన్పించబోతున్నాడు.
కొత్త ఏడాదిలో అద్భుతమైన సీరియల్స్ మాత్రమే కాదు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని టన్నుల కొద్దీ అందించేందుకు సిద్ధంగా ఉంది జీ తెలుగు. అందులో భాగంగానే రెండు కొత్త సీరియల్స్‌ని సిద్ధం చేయడంతో పాటు.. జీ కుటుంబం మొత్తం ఆనందోత్సాహల మధ్య పాల్గొన్న సంక్రాంతి సంబరాలు ఈవెంట్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. జీ తెలుగు కుటుంబ సభ్యుల ఆటపాటలు, సరదాలు, డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌లతో ఈవెంట్ కన్నుల పండుగగా సాగింది.
జీ కుటుంబం బిగ్ బ్యాంగ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు.. కొత్తగా లాంచ్ అయిన సీరియల్స్.. త్వరలో మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో.. డోంట్ మిస్ ఇట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com