లేటెస్ట్ కామెడీ రియాలిటీ షో 'అదిరింది' లాంచ్ చేసిన జీ తెలుగు
- IndiaGlitz, [Saturday,December 21 2019]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ జీ తెలుగు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది జీ తెలుగు. జీ తెలుగులో ఇప్పటికే ఎన్నో కామెడీ కార్యక్రమాలు వచ్చాయి. 2007లో జీ కామెడీ షో, 2011-12లో జీ కామెడీ క్లబ్, 2014లో ఫ్యామిలీ సర్కస్, 2017లో కామెడీ కిలాడీలు కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు నవ్వుల నైట్స్ పేరుతో ప్రతీ శనివారం, ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మిమ్మల్ని నాన్‌స్టాప్‌గా నవ్వించేందుకు సిద్ధమైంది జీ తెలుగు. ఇప్పటికే లోకల్ గ్యాంగ్స్ అనే కార్యక్రమాన్ని అందిస్తున్న జీ తెలుగు ఇప్పుడు అదిరింది అనే అదిరిపోయే కార్యక్రమాన్ని సిద్ధం చేసింది.
భవిష్యత్ కామెడీ స్టార్స్‌ని వెతికి పట్టుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన జీ తెలుగు అదిరింది కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా డిసెంబర్ 15, ఆదివారం కర్టైన్ రైజర్ ను ప్రసారం చేసింది. డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న అదిరింది మొదటి ఎపిసోడ్‌ని రాత్రి 9 గంటల నుంచి జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీ చానెల్స్‌లో వీక్షించండి.
సమీరా షరీఫ్ యాంకర్‌గా వ్యవహరించనున్న ఈ అదిరింది కార్యక్రమానికి కామెడీ షెహన్షా నాగబాబు జడ్జ్‌గా వ్యవహరిస్తారు. ఇక టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసుకున్న పార్టిసిపెంట్స్‌ని నాలుగు టీమ్‌లుగా విభజిస్తారు ఒక్కో టీమ్‌కు ధన్‌రాజ్, వేణు, ఆర్పీ, చంద్ర లీడర్లుగా ఉంటారు. వీరి ఆధ్వర్యంలో ప్రతీ టీమ్ కష్టపడి కామెడీ షెహన్షా అయిన నాగబాబుని మెప్పించాలి. ఇక అన్నింటికి మించి ఈ అదిరింది కార్యక్రమానికి మరో హైలెట్ ఉంది. దక్షిణ భారతదేశంలో కామెడీ షోలో తొలిసారిగా ఇందులోని సభ్యులకు టీమ్ లీడర్లు అవకాశాలు ఇస్తారు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ మాండలీకాలను విభిన్నంగా మాట్లాడే వ్యక్తులను అవకాశాలు వస్తాయి.
అదిరింది షోలో మరో హైలెట్ ఏంటంటే.. జడ్జ్‌ల పాయింట్స్‌తో పాటు మిస్స్డ్ కాల్ ద్వారా కూడా వోటింగ్ ఉంటుంది. 4వ ఎపిసోడ్ నుంచి ఆడియన్స్ ద్వారా వచ్చిన ఓట్లని చెప్తారు. వాటిని లీడర్ బోర్డ్‌లో అప్డేట్ చేస్తారు. ఫైనల్ షోలో మాత్రమే జ్యూరీ స్కోర్లు బయటకు చెప్తారు. అప్పటివరకు జ్యూరీ స్కోర్ గోప్యంగా ఉంచుతారు.
అదిరింది షో మొదటి ఎపిసోడ్లో నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వాక్ ఇన్ జడ్జ్‌గా వచ్చింది. వీరితో పాటు స్పెషల్ ఎట్రాక్షన్‌గా రాజ్‌తరుణ్ వచ్చాడు. రాజ్‌తరుణ్ కొత్త సినిమా ఇద్దరి లోకం ఒక్కటే ప్రమోషన్లో భాగంగా అదిరింది షోకి వచ్చాడు. రావడమే కాదు.. ప్రేక్షకుల కోసం ఒక స్కిట్ కూడా చేశాడు.
న్యాయమూర్తులు ఓట్లలో 50 శాతం, ఆడియన్స్ ఓట్లతో 50 శాతం వచ్చిన టీమ్ లీడర్ని విజేతగా ప్రకటిస్తారు. అదిరింది షో ద్వారా జీ తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన కామెడని అందించడమే కాకుండా.. కొత్తతరం కామెడీ స్టార్స్‌ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.
అద్భుతమైన అదిరింది షో ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలనుంచి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హచ్డీ చానెల్స్‌లో వీక్షించండి.