కనుల పండుగగా జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 ని జరుపుకున్న జీ తెలుగు
Send us your feedback to audioarticles@vaarta.com
నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ జీ తెలుగు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన జీ తెలుగు… ఇప్పుడు మరోసారి జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 తో మెస్మెరైజ్ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జీ తెలుగు రెండవ జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించింది. ఈ అవార్డుల కార్యక్రమంలో సినీతారల డ్యాన్సులు, ఆటపాటలు మరియు అదిరిపోయే పర్‌ఫార్మెన్స్‌లు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
మునుపెన్నడూ చూడని రీతిలో జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 కార్యక్రమాన్ని నిర్వహించింది జీ తెలుగు. టాలీవుడ్ ప్రముఖ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, సమంత అక్కినేని , పూజ హెగ్డే , జయప్రద, ఖుష్బూ, భూమిక , సుష్మిత కొణిదెల ,కార్తికేయ, నిధి అగర్వాల్, సిద్ శ్రీరామ్, సింగర్ చిన్మయి , ఛార్మి కౌర్ , పూరి జగన్నాధ్ , రామ్ పోతినేని, రెజీనా కాసాండ్రా, మెహ్రీన్ పిర్జాదా, జీవిత రాజశేఖర్ , శివాత్మిక రాజశేఖర్ , ఆనంద్ దేవరకొండ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.
జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020కి తమ యాంకరింగ్‌తో మరింత అందం తీసుకువచ్చారు ప్రదీప్ మాచిరాజు, యాంకర్ శ్యామల మరియు యాంకర్ రవి. వీరి కామెడీ టైమింగ్‌తో అవార్డుల కార్యక్రమంలో నవ్వులు పువ్వులు విరిశాయి. ఈ వేదికపై టాలీవుడ్ తారాగణం అంతా కలిసి గత సంవత్సర సినిమా వైభవాన్ని అద్భుతంగా జరుపుకొని, విజేతల మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఆహ్లాదకరమైన సాయంత్ర వేళ అందరి వీక్షకుల మనసును తన గాత్రంతో సిద్ శ్రీరామ్ మైమరిపించారు. ఒక అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. మెహ్రీన్, రెజీనా వాళ్ళ వాళ్ళ పర్‌ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులని మంత్రముగ్ధులు చేసారు. కార్తికేయ పర్‌ఫార్మెన్స్ కార్యక్రమానికే హైలెట్ గా నిలిచింది.
అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌లు, ఆకట్టుకునే డ్యాన్సులు, కామెడీ పంచ్‌లు, స్టార్ హీరోయిన్స్ స్టెప్పులు.. అన్నీ జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 కార్యక్రమంలో. అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగిన ఈ జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. త్వరలోనే ఈ కార్యక్రమం మీ జీ తెలుగు మరియు జీతెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో ప్రసారం కానుంది. సో.. డోంట్ మిస్ ఇట్.
జీ తెలుగు గురించి
జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోజ్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోజ్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout