అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ వీక్షకులకు థ్రిల్ ఇస్తున్న 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్' ట్రైలర్

  • IndiaGlitz, [Saturday,October 03 2020]

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మించింది. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి బైలింగ్వల్ వెబ్ సిరీస్ ఇది. అక్టోబర్ 2న 'జీ 5'లో హిందీ వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదల చేశారు. ఈ నెల 9న తెలుగు వెర్షన్ విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు.

డిసెంబర్ 17న గుంటూరులో అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన వైఫ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో టోనీ లూక్ కంప్లైంట్ ఇవ్వడం తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.‌ తన భర్త కనపడడం లేదని మరో మహిళ కంప్లైంట్ ఇస్తుంది. అతడు కూడా అదే పెళ్ళికి వెళతాడు.‌ వాళ్ళిద్దరికి సంబంధం ఉందా? లవ్ ఎఫైర్లు, చీకటి సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రిలేషన్షిప్స్ కి కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా? రిలేషన్షిప్ లో జలసీ ఎటువంటి పాత్ర పోషించింది? ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య ద్రోహం, మోసం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఊహించని మలుపులతో సాగుతుందని 'జీ 5' వర్గాలు తెలిపాయి. ప్రతి ఎపిసోడ్ వీక్షకులకు థ్రిల్ ఇస్తుందని అంటున్నారు.

ట్రైలర్ విడుదలైన సందర్భంగా 'ఎక్స్‌పైరీ డేట్'తో డిజిటల్ తెరంగేట్రం చేస్తున్న స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ ట్రైలర్ విడుదలైంది. భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తం పది ఎపిసోడ్లు కల ఈ సిరీస్ నుండి ప్రేక్షకులు చాలా ఆశించవచ్చు. ఇందులో చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్, ఊహించని మలుపులు ఉంటాయి. 'జీ 5'లో సిరీస్ విడుదల అవుతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకులు సిరీస్ చూస్తారని ఆశిస్తున్నా అని అన్నారు.

వెబ్ సిరీస్ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'. రెండు భాషల్లోని ప్రతిభావంతులైన నటీనటులతో దీన్ని రూపొందించాం. అందరూ అద్భుతంగా నటించారు. 'జీ 5'లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను నిర్మించినందుకు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

More News

ఏపీ సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన మామ, వైఎస్ భారతిరెడ్డి తండ్రి అయిన ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు.

హైదరాబాద్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు..

హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. బోరబండలో భూమి కంపించింది. రాత్రి 8.45, 11.42 నిమిషాలకు రెండు సార్లు భూమి కంపించింది.

తీగల వంతెనపై సరికొత్త ఆంక్షలు.. రాత్రి 11 దాటితే బంద్..

హైదరాబాద్‌‌కు దుర్గం చెరువుపై తీగల వంతెన మరో ఐకాన్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే.

అక్టోబర్.. కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం

అక్టోబర్ వచ్చేసింది. రూలింగ్ అయితే మారలేదు కానీ రూల్స్ మాత్రం మారిపోయాయి.

మెహబూబ్ రాక్.. సుజాత ఫైర్..

ఇవ్వాళ షోలో మార్నింగ్ మస్తీ.. ఫ్యాషన్ షో జరిగింది... అవినాష్ అద్దంలా మారడం మినహా పెద్దగా చెప్పుకోదగిన అంశాలేమీ లేవు.