Zakir Hussain, Shankar Mahadevan:గ్రామీ అవార్డుల్లో సత్తా చాటిన జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్

  • IndiaGlitz, [Monday,February 05 2024]

యాక్టింగ్ రంగంలో ఆస్కార్ అవార్డులు ఎంత ముఖ్యమో.. సంగీత రంగంలో గ్రామీ అవార్డులు అంతే ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమై అవార్డులకు ప్రాముఖ్యత ఉంది. తాజాగా 66వ గ్రామీ అవార్డుల(Grammy Awards) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు తమ పాటలతో సందడి చేశారు. అంతర్జాతీయ వేదికపై జరిగిన ఈ వేడుకలో భారతీయ సంగీత కళాకారులు శంకర్‌ మహదేవన్‌(Shankar Mahadevan), జాకిర్‌ హుస్సేన్ అవార్డులు గెలుచుకున్నారు.

శక్తి(Sakthi) పేరుతో ఈ బృందం కంపోజ్‌ చేసిన ‘దిస్‌ మూమెంట్‌’(This moment)అల్బమ్.. ఉత్తమ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ అవార్డును సొంతం చేసుకుంది. జాన్‌ మెక్‌లాఫ్లిన్‌ (గిటార్‌), జాకీర్‌ హుస్సేన్ (తబలా), శంకర్‌ మహదేవన్‌(సింగర్‌), గణేశ్‌ రాజగోపాలన్‌ (వయోలిన్‌) ‘శక్తి’ బ్యాండ్‌ పేరుతో ఈ ఆల్బమ్‌ కంపోజ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖల నుంచి పోటీని ఎదుర్కొని ‘శక్తి’ టీమ్‌ విజేతగా నిలిచింది. అలాగే ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శనకు గాను జాకిర్ హుస్సేన్,బెలా ఫెక్ అవార్డు అందుకున్నారు. ఇక 'మిడ్‌ నైట్స్‌ ఆల్బమ్‌'కు గానూ టేలర్‌ స్విఫ్ట్‌ ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఈయర్‌ పురస్కారం అందుకున్నారు.

గ్రామీ-2024 విజేతలు..

గ్లోబల్‌ మ్యూజిక్‌ ప్రదర్శన - జాకిర్‌ హుస్సేన్‌, బెలా ఫెక్‌ (పష్టో)

గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ - శక్తి (దిస్ మూమెంట్‌)

ఉత్తమ క్లాసికల్‌ సోలో వోకల్‌ ఆల్బమ్‌ - జూలియా బూల్లక్‌, సోలోయిస్ట్‌ (వాకింగ్‌ ఇన్‌ ద డార్క్‌)

ఉత్తమ ర్యాప్‌ ఆల్బమ్‌ - మైఖేల్‌ (కిల్లర్‌ మైక్‌)

ఉత్తమ ఆఫ్రికన్‌ సంగీత ప్రదర్శన - టైలా (వాటర్)

ఉత్తమ రాక్‌ సాంగ్‌, ప్రదర్శన- బాయ్‌జెనియస్‌ (నాట్‌ స్ట్రాంగ్‌ ఎనఫ్‌)

ఉత్తమ రాక్ ఆల్బమ్‌- పారామోర్‌ (దిస్‌ ఇజ్‌ వై)

ఉత్తమ కామెడీ ఆల్బమ్‌- డేవ్‌ చాపెల్‌ ( వాట్స్ ఇన్ ఏ నేమ్‌)

ఉత్తమ కంట్రీ సాంగ్‌, సోలో ప్రదర్శన - క్రిస్‌ స్టేప్లెటన్‌ (వైట్‌ హార్స్‌)

మ్యాజిక్‌ వీడియో - జోనథన్‌ క్లైడ్‌ ఎమ్‌ కూపర్‌ (ఐయామ్‌ ఓన్లీ స్లీపింగ్‌)

గ్రామీ అవార్డు వచ్చిన సందర్భంగా శంకర్ మహాదేవన్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రతి విషయంలో తనకు ఎంతో ప్రోత్సాహం అందించిన తన భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నానని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. భారత్ తరపున ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు సాధించనందుకు శక్తి టీమ్‌కు ప్రముఖ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

More News

Telangana Cabinet:తెలంగాణ తల్లి విగ్రహం, TS పేరులో మార్పులు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఆమోదం తెలిపింది.

Raajadhani Files:అమరావతి ఉద్యమం ఆధారంగా.. 'రాజధాని ఫైల్స్' ట్రైలర్ విడుదల..

ఏపీలో ఎన్నికల వేళ పొలిటికల్ సినిమాల హవా నడుస్తోంది. ఇప్పటికే వైయస్ జగన్ జీవితంలో జరిగిన పరిణామాలతో వ్యూహం,

Governor:తమది రైతులు, పేదల ప్రభుత్వం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించారు.

Chiranjeevi: నంది అవార్డులు ఇవ్వకపోవడం బాధించింది: చిరంజీవి

తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా ఇస్తానని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

Telangana Cabinet:రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..

తెలంగాణ కేబినెట్ ఆదివారం భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.