ఆ ఒక్క సాంగ్ తో సినిమా బ్లాక్ బస్టర్.. ఎన్టీఆర్ మూవీపై వైవిఎస్ చౌదరి
- IndiaGlitz, [Monday,May 24 2021]
తెలుగు సినిమా కమర్షియల్ స్థాయిని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ముఖ్యంగా ఎన్టీఆర్, చిరంజీవి లతో ఆయన సాధించిన కమర్షియల్ సక్సెస్ లు అన్నీఇన్నీ కావు. ఆదివారం రోజు రాఘవేంద్ర రావు బర్త్ డే సందర్భంగా తన గురువు గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశారు దర్శకుడు వైవిఎస్ చౌదరి.
ఎన్టీఆర్, రాఘవేంద్ర రావు కాంబోలో వచ్చిన కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి గురించి చౌదరి చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వైవిఎస్ చౌదరి చాలా కాలం పాటు రాఘవేంద్ర రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. రాఘవేంద్ర రావు గారు ఎప్పుడూ ఎన్టీఆర్ గారిని ఎలా వైవిధ్యంగా చూపించాలి అని ఆలోచిస్తూ ఉండేవారు.
కొండవీటి సింహం రిలీజ్ కి ముందు ఏఎన్నార్ నటించిన ప్రేమాభిషేకం విడుదలై రికార్డుల వరద పారించింది. ఎలాగైనా కొండవీటి సింహం.. ప్రేమాభిషేకం రికార్డ్స్ ని తిరగరాయాలని కోరుకునేవాళ్ళం. ప్రేమాభిషేకం ఏడాది రికార్డ్స్ ని కొండవీటి సింహం 50 రోజుల్లోనే అధికమించి తిరుగులేని విజయం సాధించింది. వేటగాడు తర్వాత అంతటి సంతోషాన్ని ఇచ్చిన చిత్రం కొండవీటి సింహం అని వైవిఎస్ చౌదరి అన్నారు.
ఇక జస్టిస్ చౌదరి విషయానికి వస్తే అప్పటివరకు సినిమా యావరేజ్ గా వెళుతోంది.. కానీ 'చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో' అనే బ్లాక్ బస్టర్ సాంగ్ తో సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చౌదరి అన్నారు. ఆ సాంగ్ లో రాఘవేంద్ర రావు గారు ఎన్టీఆర్ ని చూపించిన విధానం, వేటూరి లిరిక్స్ అల్టిమేట్ అని వైవిఎస్ చౌదరి అన్నారు.