జోష్ బాటలో యుద్ధం శరణం..
Saturday, August 12, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రారండోయ్ వేడుక చూద్దాంతో ఈ ఏడాది ప్రథమార్థంలో తన ఖాతాలో మరో హిట్‌ని జమ చేసుకున్నాడు నాగచైతన్య. ఈ సినిమా విజయం చైతన్యలో ఉత్సాహాన్ని నింపింది. రారండోయ్.. తరువాత ఈ అక్కినేని వారి వారసుడు నుంచి వస్తున్న చిత్రం యుద్ధం శరణం. మనంలో చైతూ పక్కన కాసేపు స్క్రీన్‌పై సందడి చేసి.. ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయనా కోసం నాగార్జున పక్కన పూర్తిస్థాయి కథానాయికగా సందడి చేసి.. రెండు సందర్భాల్లోనూ సక్సెస్‌ని అందుకున్న లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్‌గా నటించింది.
కొత్త దర్శకుడు కృష్ణ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ 8కి పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది. విశేషమేమిటంటే.. నాగచైతన్య తొలి చిత్రం జోష్ ఇలానే సెప్టెంబర్ ప్రథమార్థంలో రిలీజైంది. ఆ సినిమా తరువాత మళ్లీ సెప్టెంబర్ నెలలో వస్తున్నది యుద్ధం శరణం నే. జోష్ లాగే ఈ సినిమా ఫరవాలేదనిపించుకుంటుందో లేక విజయం సాధిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments