జోష్ బాటలో యుద్ధం శరణం..

  • IndiaGlitz, [Saturday,August 12 2017]

రారండోయ్ వేడుక చూద్దాంతో ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో త‌న ఖాతాలో మ‌రో హిట్‌ని జ‌మ చేసుకున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ సినిమా విజ‌యం చైత‌న్య‌లో ఉత్సాహాన్ని నింపింది. రారండోయ్‌.. త‌రువాత ఈ అక్కినేని వారి వార‌సుడు నుంచి వ‌స్తున్న చిత్రం యుద్ధం శ‌ర‌ణం. మనంలో చైతూ ప‌క్క‌న కాసేపు స్క్రీన్‌పై సంద‌డి చేసి.. ఆ త‌రువాత సోగ్గాడే చిన్ని నాయ‌నా కోసం నాగార్జున ప‌క్క‌న పూర్తిస్థాయి క‌థానాయిక‌గా సంద‌డి చేసి.. రెండు సంద‌ర్భాల్లోనూ స‌క్సెస్‌ని అందుకున్న లావ‌ణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్‌గా న‌టించింది.
కొత్త ద‌ర్శ‌కుడు కృష్ణ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 8కి పోస్ట్ పోన్ చేశార‌ని తెలుస్తోంది. విశేష‌మేమిటంటే.. నాగ‌చైత‌న్య తొలి చిత్రం జోష్ ఇలానే సెప్టెంబ‌ర్ ప్ర‌థ‌మార్థంలో రిలీజైంది. ఆ సినిమా త‌రువాత మ‌ళ్లీ సెప్టెంబ‌ర్ నెల‌లో వ‌స్తున్నది యుద్ధం శ‌ర‌ణం నే. జోష్ లాగే ఈ సినిమా ఫ‌ర‌వాలేద‌నిపించుకుంటుందో లేక విజ‌యం సాధిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

More News

'ప్రాజెక్ట్ z' సెన్సార్ పూర్తి..సెప్టెంబర్ ప్రథమార్థంలో విడుదల

సందీప్ కిషన్,లావణ్య త్రిపాటి,జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి.కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్'

నిత్యా మీనన్..ఎన్నాళ్లెన్నాళ్లకు..

పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లోనే కనిపించడానికి ఇష్టపడే కథానాయిక నిత్యా మీనన్

శోభన్ తో తల్వార్...

రాజా చెయ్యి వేస్తేచిత్రంలో నటించిన ఇషా తల్వార్ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించలేదు.

తల్లి పాత్రలో మీనా...

బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన మీనా తర్వాత స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.

ఈ సంక్రాంతి ఆ లెక్కన మహేష్ కి ఓకే..

సూపర్ స్టార్ కృష్ణ కి సంక్రాంతి అచ్చొచ్చిన సీజన్.