ys sharmila: కమలం వికసిస్తుందని.. మా చెవిలో ఎన్ని పూలు పెడతారు : మోడీపై షర్మిల సెటైర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఆమె వరుస ట్వీట్లు చేశారు. “తెలంగాణా అంతటా కమలం వికసిస్తుంది” అంటున్న మోడీగారు, మీ పూలు వికసించాలి, మా తెలంగాణ ప్రజల చెవుల్లో పెట్టాలి, అంతేనా సారూ? కోచ్ ఫ్యాక్టరీ నుండి ITIR వరకు, విభజన హామీల నుండి 2 కోట్ల కొలువుల వరకు, ఇంకెన్ని పూలు వికసింపజేసుకుంటారు, ఎన్ని మా చెవిలో పెడతారు? అని ఆమె సెటైర్లు వేశారు. మెగాస్కాం కాళేశ్వరంతో రూ.వేల కోట్లు వెనకేసుకున్న కమిషన్ రావు అండ్ కో మీద చర్యలేవి? “కాళేశ్వరం KCRకు ATM. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది” అని గప్పాలు కొట్టే బీజేపీ పెద్దలు ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు? అని మరో ట్వీట్ లో షర్మిల ప్రశ్నించారు.
రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం:
కాగా.. రామగుండంలో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. దీనితో పాటు భద్రాచలం రోడ్ నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అలాగే రూ.2,268 కోట్లతో చేపట్టనున్న మెదక్ - సిద్ధిపేట - ఎల్కతుర్తి హైవే విస్తరణ పనులను , బోధన్ - బాసర - భైంసా పనులకు, సిరొంచా - మహాదేవపూర్ జాతీయ రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
సింగరేణిని మేమెలా అమ్మగలం :
2016లోనే రామగుడం ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేశామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. అయినప్పటికీ రైతులకు యూరియా కొరత రాకుండా చూస్తున్నామని ప్రధాని తెలిపారు. 2014 కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవాళ్లని.. తాము అధికారంలోకి వచ్చాక కొరత లేకుండా చూశామని మోడీ స్పష్టం చేశారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని... అలాంటప్పుడు దానిని కేంద్రం ఎలా విక్రయించగలుగుతుందని ప్రధాని ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout