ys sharmila: షర్మిల నియోజకవర్గం ఫిక్స్.. ‘‘పాలేరు’’ నుంచి బరిలోకి.. అక్కడే ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా తెలంగాణకు వచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు వైఎస్ షర్మిల. కుటుంబం నుంచి అండదండలు లేనప్పటికీ.. తల్లి, భర్త సహకారంతో ఆమె రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నాటికి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని షర్మిల కష్టపడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలాగే తండ్రి బాటలో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారు షర్మిల.
షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఊహాగానాలు:
అంతా బాగానే వుంది కానీ.. త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలపై ఆమె దృష్టి పెట్టారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చింది వైఎస్సార్‌టీపీ. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగబోతున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు మీడియాకు తెలియజేశారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తున్నందున జూన్ 19న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు.
పాలేరులో రెడ్లదే హవా:
ఇకపోతే.. పాలేరు నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్‌కు పట్టున్న స్థానం. ఇక్కడ రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. అలాగే గిరిజన ఓటు బ్యాంకు అధికంగా ఉండడం.. ఆయా గ్రామాలు రెడ్డి సామాజికవర్గం చేతుల్లోనే ఉండడం, తన తండ్రి అభిమానులు భారీగా ఉండడం, రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసొస్తాయన్న షర్మిల భావిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే రాజన్న బిడ్డ వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారని అనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com