ఇదే జరిగితే నెల్లూరులో వైసీపీ ఖాళీ..!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల ముందు వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగలనుందా..? కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ కానుందా..? ‘ఒకే ఒక్కడు’ దెబ్బ కొడితే వైసీపీ కోలుకోవడం కష్టమేనా..? జగన్ వైఖరి మింగునపడక ఆ పెద్దాయన వైసీపీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారా..? అంటే తాజాగా జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. అసలు ఆ పెద్దాయన ఎవరు..? ఎందుకు వైసీపీని వీడాలనుకుంటున్నారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఒకానొక టైమ్లో ఆనం బ్రదర్స్ అంటే నెల్లూరు.. నెల్లూరు అంటేనే ఆనం బ్రదర్స్లాగా పరిస్థితులుండేవి. అయితే ఎప్పుడైతే మేకపాటి నెల్లూరులోకి అడుగుపెట్టారో అప్పట్నుంచి ఆనం బ్రదర్స్ సీన్ రివర్స్ అయ్యింది. నెల్లూరు జిల్లా మేకపాటిదే అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలను అన్నీ దగ్గరుండి చూసుకునే వారు. అంతేకాదు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణాంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలు అండదండలందిస్తూ ఉంటూ వచ్చారు. అయితే సడన్తో ఏమైందో తెలియదుగానీ ఆయన వైసీపీని వీడాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సర్వేలే కారణమా.. అనారోగ్యమా!?
వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ (పీకే) ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించిన సంగతి తెలిసిందే. పార్టీ బలహీనంగా ఉన్న ఎవర్ని నిలబెడితే అనుకూల వాతావరణం ఉంటుందనే విషయాలను నిశితంగా సర్వే చేసిన పీకే నివేదికల ప్రకారం త్వరలోనే వైఎస్ జగన్ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. అయితే 2014 ఎన్నికల్లో వచ్చినంతగా నెల్లూరు జిల్లాలో ఫలితాలు రావని సర్వేలో తేలినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా మేకపాటి ఫ్యామిలీ పోటీచేసే నెల్లూరు పార్లమెంట్, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయని కొందరు సర్వే లీకులు వదిలారట. ఈ విషయం తెలుసుకున్న మేకపాటి ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తికి లోనైన మేకపాటి పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారట. వైసీపీ వీడుతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో అటు అభిమానులు.. ఇటు కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.
టీడీపీలోకి వెళ్తారా..?
వైసీపీని వీడి బయటికొచ్చిన తర్వాత మేకపాటి ఫ్యామిలీ టీడీపీలో చేరుతుందా..? లేకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటుందా..? మేకపాటి పోటీకి దూరంగా ఉంటే ఆయన కుమారుడు, సోదరుడు, ముఖ్య అనుచరులు పరిస్థితేంటి..? అనేది ఇప్పుడు వేయి డాలర్ల ప్రశ్న. వైఎస్ కుటుంబానికి మేకపాటి కుటుంబానికి చాలా మంచి సంబంధాలుండేవి. అయితే టీడీపీ గాలానికి ఆయన పడిపోయారా ఏంటి..? టీడీపీలోని చోటా చోటా నేతలకే వలవేస్తున్న వైసీపీకి.. ఈ రూపంలో కోలుకుకోలేని షాక్ ఇచ్చేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది.
అయితే గత 24 గంటలుగా ఈ వార్తలు నెట్టింట్లో, టీవీ చానెళ్లలో ప్రసారమవుతుండగా ఇంతవరకు మేకపాటి ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. అంటే మౌనానికి అర్థం అంగీకారమేనా..? లేకుంటే మీడియా ముందుకొచ్చి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడతారో..? ఈ వార్తలనే మేకపాటి నిజం చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout