వైసీపీ వర్సెస్ టీడీపీ.. వై బ్రదర్ చైన్డ్!?
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియా ప్రస్తుతం జీరోను హీరో చేస్తోంది.. హీరోను జీరో చేస్తోంది..! ఈ మీడియాను కొందరు పనికొచ్చే పనులు వాడుకుంటుంటే అంతకు రెట్టింపు మంది అనవసర పనులకే వాడేస్తున్నారు. ఇలా రోజురోజుగా పెరుగుతున్న టెక్నాలజీ సోషల్ మీడియాను విరివిరిగా వాడేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైంది మొదలు ఇప్పటి వరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ,జనసేన అభిమానులు, కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఫేస్బుక్ పోస్ట్‌లు, ట్వీట్ల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అయితే కొందరు వైసీపీ వీరాభిమానులు టీడీపీకి సంబంధించిన విషయాలను.. వీళ్లు వైసీపీకి చెందిన నేతల మాటలను పట్టుకుని వివాదం రేపుతుంటారు. అలాంటిదే సరిగ్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు #Whokilledbabai అనే ట్యాగ్‌ను తెగ పాపులర్ చేశారు. టీడీపీ వాళ్లు ఏం పోస్ట్ చేసిన దీన్ని ట్యాగ్ చేయడం.. మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన పోస్ట్‌లకు కామెంట్ల రూపంలో అన్నీ సరిగే #Whokilledbabai దీని సంగతేంటి..? అని అదేపనిగా హడావుడి చేశారు.
దీంతో తాము కూడా ఇందుకు రివెంజ్ తీర్చుకోవాలంటూ వైఎస్ జగన్ అభిమానులు స్కెచ్ వేసి మరీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు.. చంద్రబాబు చేసిన కామెంట్స్‌ను గుర్తుకుతెచ్చుకున్నారు. సొంత తమ్ముడ్ని కుటుంబీకులను బాబు పట్టించుకోలేదని.. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడ్ని గొలుసులతో కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఆ తర్వాత రామ్ముర్తి నాయుడు కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు కూడా. అయినప్పటికీ వైసీపీ వాళ్లు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకుని #Whokilledbabai కి వ్యతిరేకంగా #Whybrotherchained అని బాగా పాపులర్ చేశారు.. ఇప్పుడీ ట్యాగ్ నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ ట్యాగ్ ట్రెండవుతుంటంతో టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు తాము స్ట్రాంగ్ కౌంటరిచ్చామంటూ వైసీపీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాయిగా ఉండగా కార్యకర్తలు మాత్రం ఒకర్నొకరు తిట్టిపోసుకుంటున్నారు. ఫలితాలు వచ్చేంత వరకు, ఆ తర్వాత మున్ముంథు ఇంకెన్ని ఇలాంటి ట్రెండింగ్స్ నెట్టింట్లో వైరల్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments