MLA Biyyapu Madhusudhan Reddy:చిరుపై అభిమానం.. థియేటర్ బుక్ , కార్యకర్తలతో కలిసి ‘వాల్తేర్ వీరయ్య’చూసిన వైసీపీ ఎమ్మెల్యే
Send us your feedback to audioarticles@vaarta.com
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శృతీహాసన్ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా వసూళ్ల కుంభవృష్టి కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే 105 కోట్లు వసూలు చేసి మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి తెలియజేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్. వరుస సెలవులు, పండుగ సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి వీరయ్యను ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ఇదిలావుండగా.. రాజకీయాలను , ఇతర అంశాలను పక్కనబెడితే చిరంజీవికి అశేష అభిమానులు వున్నారు. వివిధ పార్టీల్లోనూ ఆయనను ఆరాధించే నేతలున్నారు. చిరు సినిమా రిలీజైతే.. రాజకీయాలను పక్కనబెట్టి మరి సినిమాను వీక్షిస్తారు.
రాజకీయాల్లో వున్నా చిరంజీవి అభిమానిని :
తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే మెగాస్టార్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనో ఎవరో కాదు.చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఆయన ఒక్కడే కాకుండా వైసీపీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు కూడా సినిమా చూపించాలనుకున్న ఎమ్మెల్యే ఏకంగా ఓ థియేటర్‌ను బుక్ చేసి మరి వాల్తేర్ వీరయ్యను చూపించారు. అనంతర మెగా అభిమానులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మీడియాతో ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానినని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన స్నేహితులు, వైసీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి వాల్తేర్ వీరయ్య సినిమాను చూశానని ఆయన తెలిపారు. సినిమా చాలా బాగుందని.. ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సక్సెస్ మీట్‌లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు :
ఇకపోతే.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్యలో మాస్ మహారాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ రోల్ పోషించారు. కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, బాబీ సింహా, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. ఇదిలావుండగా సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయొద్దని, సినిమాకు కావాల్సిన దానిని పేపర్ వర్క్‌లోనే పూర్తి చేయాలని సూచించారు. సినీ పరిశ్రమ బాగుండాలని డైరెక్టర్లు గుర్తించాలని చిరు అన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని మెగాస్టార్ పేర్కొన్నారు. సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం కాదని.. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్‌లో పిక్చర్ పూర్తి చేసి ఇవ్వడమని చిరు అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com