YSRCP:అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల 4వ జాబితా విడుదల

  • IndiaGlitz, [Friday,January 19 2024]

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వరుసగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ పోతోంది. తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించింది. నాలుగో జాబితాలో 9మందిని ప్రకటించగా.. అందులో ఒకటి ఎంపీ స్థానం ఉంది. ఈ జాబితాలో ఎక్కువగా శింగనమల, తిరువూరు, మడకశిర, నందికొట్కూరు, గోపాలపురం, కొవ్వూరు, గంగాధర నెల్లూరు వంటి ఎస్సీ నియోజకవర్గ స్థానాలే ఉన్నాయి. వీటితో పాటు కనిగిరి స్థానానికి కూడా కొత్త ఇంచార్జ్‌ను వెల్లడించారు.

ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే చిత్తూరు ఎంపీగా ప్రస్తుతం ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగానూ, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్‌ ఇంఛార్జ్‌గానూ మార్చారు. గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కోవూరు నియోజకవర్గ ఇంచార్జ్‌గానూ, కోవూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్‌గానూ జంబ్లింగ్ చేశారు.

ఇక మిగిలిన స్థానాలైన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానంలో దద్దాల నారాయణ యాదవ్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన కేశినేని నాని అనుచరుడు స్వామిదాస్‌, మడకశిరలో ఎం.తిప్పేస్వామి స్థానంలో ఈర లక్కప్ప, నందికొట్కూరులో ఆర్థర్‌కు బదులుగా డా.సుధీర్‌ దారాకు కొత్త ఇంచార్జ్‌లుగా చోటు కల్పించారు.

తొలి జాబితాలో 11 ఎమ్మెల్యే స్థానాలు, రెండో జాబితాలో 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 ఎమ్మెల్యే, నాలుగో జాబితాలో ఓ ఎంపీ, 8 ఎమ్మెల్యేల అభ్యర్థులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చింది అధిష్టానం. ఇక త్వరలోనే మరో 12 ఎంపీ అభ్యర్థులు, 5 నుంచి 6 ఎమ్మెల్యే స్థానాలకు కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఇక ఎన్నికల ప్రచారంపైనే సీఎం జగన్ పూర్తి దృష్టి పెట్టనున్నారు.

 

 

More News

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సలార్'

Guntur Karaam:దుమ్మురేపిన మహేష్.. 'గుంటూరు కారం' తొలి వారం వసూళ్లు ఎంతంటే..?

సంక్రాంతి కానుకగా విడుదలైన 'గుంటూరు కారం' సినిమా కలెక్షన్స్‌లో దుమ్మురేపింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా మహేష్ బాబు స్టామినాతో థియేటర్లకు

Dhanush Nagarjuna:ధనుష్, నాగార్జున మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ప్రారంభం

తమిళ స్టార్ హీరో ధనుష్‌.. తెలుగు సినిమా దర్శకులపై మక్కువ పారేసుకుంటున్నారు. ఇటీవల యువ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో

Kodali Nani:ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలన్న బాలకృష్ణకు కొడాలి నాని కౌంటర్

దివంగత సీఎం నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు

Renuka Chaudhary:ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా.. ఆపే దమ్ము ఎవరికీ లేదు: రేణుకా చౌదరి

ఖమ్మం జిల్లా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.