‘సుజనా చౌదరి పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ నేత’!

  • IndiaGlitz, [Friday,October 25 2019]

టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత సుజనా స్పీడ్ పెంచి మరీ జగన్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఏపీలో పర్యటిస్తున్న ఆయన.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా- సీఎం వైఎస్ జగన్‌‌పై మాట్లాడుతూ నోరుపారేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా.. వైసీపీ ఎంపీ మాట్లాడుతూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. సుజనా డూప్లికేట్‌ బీజేపీ నేత, పొలిటికల్‌ బ్రోకర్ అని ఆయన మాటలకు విలువలేదన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీపై సూటి ప్రశ్నల వర్షం కురిపించారాయన.

రాష్ట్ర ప్రయోజనాలా.. చంద్రబాబు ప్రయోజనాలా!?

‘సుజనా బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా..?. మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా..? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా..?. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ధర్మదీక్షలు చేసింది నువ్వు కాదా..?. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా – జగన్‌మోహన్‌రెడ్డి భేటీ గురించి నిజమైన బీజేపీ నేత జీవీఎల్‌ నర్సింహారావు వివరించారు. సుజనా డూప్లికేట్‌ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారు. సుజనా చౌదరిపై ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాను. ఇప్పటికే జీవీఎల్‌ కూడా సుజనాపై ఫిర్యాదు చేశారరు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు పెడతాం’ అని బాలశౌరి చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే సుజనా వ్యాఖ్యలను సీరియస్ తీసుకున్న వైసీపీ.. ప్రధాని మొదలుకుని పార్లమెంట్ దాకా ఈ వ్యవహారాన్ని లాగాలని చూస్తోందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి సుజనా చౌదరి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

More News

మీకు మాత్రమే చెప్తా "నువ్వే హీరో" ప్రోమోషనల్ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ "కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్" పతాకంపై రూపొందిన సినిమా "మీకు మాత్రమే చెప్తా" . ఈ మూవీ మ్యూజిక్ వీడియో "నువ్వే హీరో" సాంగ్ లాంచ్ విజయ్ ఫాన్స్ చేతుల మీదుగా జరిగింది.

రెండు రాష్ట్రాల్లో గెలిచినా.. బీజేపీకి తప్పని తిప్పలు!

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రివర్స్ అయిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కమలం

ఇండిపెండెట్‌ను ఓడించలేకపోయిన టీడీపీ, బీజేపీ!

తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 వేలకు పైచిలుకు

కేసులే కేసులు.. ‘బండ్ల’ భవిష్యత్ ఏంటో!?

ఎటు చూసినా కేసులే.. పొద్దున నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకూ అన్నీ వివాదాలే.. మీడియా ముందుకొచ్చినా.. ఇంటర్వ్యూకు వెళ్లినా రచ్చరచ్చే.. ఏం చెప్పాలనుకుని వస్తాడో తీరా ఏం మాట్లాడతాడో..

ఏపీలో ఏమవుతుందో దేవుడికే తెలియాలి.. నేనూ చూస్తా!

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా ఏపీలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్న