‘ చింతామణి ’ నాటకంపై నిషేధం.. ఏపీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎంపీ రఘురామ

దశాబ్ధాలుగా తెలుగువారిని అలరిస్తున్న ‘‘చింతామణి’’ నాటకంపై ఇటీవల ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నాటక కళాకారులు, సామాన్యులు, పలువురు ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పాత్ర కోసం నాటక రంగంపై ఆధారపడి జీవిస్తోన్న వేలాది మంది కళాకారులు, తదితరుల ఉపాధిని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు.

చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చింతామణి నాటకంపై ఆధారపడి వేలాది మంది కళాకారులు జీవనం సాగిస్తున్నారని.. ఈ నాటకం నిషేధించడం వల్ల వారంతా జీవనోపాధి కోల్పోతున్నారని రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నాు.

ఈ మేరకు సీఎస్, రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర క్రియేటివ్‌, కల్చర్‌ కమిషన్‌ సీఈఓ, ఏపీ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ.. ఏపీ సర్కార్ జారీ చేసి జీవో నెం.7 ను రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు న్యాయస్థానాన్ని కోరారు.

కాగా తెలుగు నాటక రంగంలో ‘‘చింతామణి’’కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, శ్రీహరి, భవానీ శంకరం తదితర కీలక పాత్రలు ఉన్నాయి అయితే సుబ్బిశెట్టి అనే పాత్ర చింతామణి అనే మహిళ వ్యామోహంలో పడి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్య సామాజిక వర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఏపీ సాంస్కృతిక శాఖ.. రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

More News

హిందూపురంలో ఆందోళన.. బాలయ్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.

సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం.. మేనమామ కమలాకర్ రావు కన్నుమూత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనమామ గునిగంటి కమలాకర్ రావు (94) కన్నుమూశారు.

సాయిపల్లవిపై బాడీ షేమింగ్‌‌ కామెంట్స్: మహిళల ఎదుగుదలను ఓర్వలేరు.. గవర్నర్ తమిళిసై ఆగ్రహం

నేచురల్ స్టార్ నాని  హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘శ్యామ్ సింగరాయ్’’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

రాజమౌళి ప్రశంసలు అందుకున్న జీ 5 ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2'... నటుడు శశాంక్

ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ 'లూజర్' చూశారా? ఆ సిరీస్‌ను అంత త్వ‌ర‌గా వీక్షకులు మర్చిపోలేరు.