Gorantla Madhav : ‘‘ మీ ఇంటికొచ్చి ఒరిజినల్‌గా చూపిస్తా.. నా *** ల్లారా’’ : ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరదించారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఎంపీ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి వుండొచ్చన్నారు. సదరు వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ప్రకటించారు. ఒరిజినల్ వీడియో వుంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామని ఫకీరప్ప పేర్కొన్నారు.
ఆ వీడియో చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా:
ఆ వెంటనే గోరంట్ల మాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వీడియో ఫేక్‌దని ఎస్పీనే చెప్పారని.. ఇది మార్ఫింగ్ వీడియో అని ఆనాడే తాను చెప్పానని మాధవ్ తెలిపారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. బీసీలు ఎదుగుతుంటే టీడీపీ ఓర్వలేకపోతోందని.. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి తాను టెన్షన్ పడలేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అనుకున్నానని మాధవ్ పేర్కొన్నారు.
నా బొచ్చు కూడా పీకలేరు:
ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు మాధవ్. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. తెలంగాణ నుంచి ఏపీలో పడ్డారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నీతిమంతుడైతే తన ఆడియో టేప్‌ను స్వయంగా ఫోరెన్సిక్ అధికారులకు ఎందుకు అప్పగించలేదని మాధవ్ ప్రశ్నించారు. తన వీడియో ఫేక్ అని రుజువైందని... చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తన బొచ్చు కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. ఈ కుట్రకు పాల్పడిన వారు తన వీడియో చూడాలనుకుంటే ఒరిజినల్‌గా ఇంటికే వచ్చి చూపిస్తానంటూ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments