Gorantla Madhav : ‘‘ మీ ఇంటికొచ్చి ఒరిజినల్‌గా చూపిస్తా.. నా *** ల్లారా’’ : ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Thursday,August 11 2022]

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరదించారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఎంపీ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి వుండొచ్చన్నారు. సదరు వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ప్రకటించారు. ఒరిజినల్ వీడియో వుంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామని ఫకీరప్ప పేర్కొన్నారు.

ఆ వీడియో చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా:

ఆ వెంటనే గోరంట్ల మాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వీడియో ఫేక్‌దని ఎస్పీనే చెప్పారని.. ఇది మార్ఫింగ్ వీడియో అని ఆనాడే తాను చెప్పానని మాధవ్ తెలిపారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. బీసీలు ఎదుగుతుంటే టీడీపీ ఓర్వలేకపోతోందని.. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి తాను టెన్షన్ పడలేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అనుకున్నానని మాధవ్ పేర్కొన్నారు.

నా బొచ్చు కూడా పీకలేరు:

ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు మాధవ్. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. తెలంగాణ నుంచి ఏపీలో పడ్డారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నీతిమంతుడైతే తన ఆడియో టేప్‌ను స్వయంగా ఫోరెన్సిక్ అధికారులకు ఎందుకు అప్పగించలేదని మాధవ్ ప్రశ్నించారు. తన వీడియో ఫేక్ అని రుజువైందని... చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తన బొచ్చు కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. ఈ కుట్రకు పాల్పడిన వారు తన వీడియో చూడాలనుకుంటే ఒరిజినల్‌గా ఇంటికే వచ్చి చూపిస్తానంటూ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More News

Pawan Kalyan: సన్మానాలే కాదు, భరోసాగా నిలవడంలోనూ మోడీ ఆదర్శనీయులు : పవన్ కల్యాణ్

ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బ్రిటన్‌లో జరుగుతోన్న కామన్‌వెల్త్ క్రీడల్లో

Pawan Kalyan : ప్రశ్నిస్తే చాలు అట్రాసిటీ కేసే... ఇంత అడ్డగోలుగానా: జగన్ పాలనపై పవన్ నిప్పులు

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ అడ్డగోలుగా ఉపయోగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan : ఎమ్మెల్యే బూతులు తిడుతున్నా.. ధైర్యంగా నిలబడ్డ వైనం: జనసేన వీరమహిళలకు పవన్ సత్కారం

ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం విపక్ష పార్టీల కర్తవ్యమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Chiranjeevi: కంటెంట్ వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది.. బింబిసార, సీతారామంపై చిరు ప్రశంసలు

యువతను, ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే.

Janasena : సంక్షేమ పథకాలు అందడం లేదంటే కేసులు పెడతారా : జగన్‌ ప్రభుత్వంపై నాదెండ్ల ఫైర్

వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న గడప గడపకు కార్యక్రమంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.