వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఫిక్స్.. జాబితా వచ్చేసింది!?

  • IndiaGlitz, [Friday,March 08 2019]

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అటు అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. కాగా ఇప్పటికే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకూ వైసీపీ, జనసేన మాత్రం ప్రకటించలేదు. అయితే నెట్టింట్లో మాత్రం వైసీపీకి సంబంధించిన కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా హల్ చల్ చేస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఫిక్స్ అయ్యారంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ జాబితాలోని అభ్యర్థులు దాదాపు ఫిక్స్ అయ్యారని.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని వార్తలు వినవస్తున్నాయి.

-: పార్లమెంట్ నియోజకవర్గాలు.. అభ్యర్థుల పేరు:- 
శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాస్
విజయనగరం - బొత్స ఝాన్సీ
విశాఖ - ఎంవివి చౌదరి
అనకాపల్లి - వరద కల్యాణి
కాకినాడ - బలిజి అశోక్
రాజమండ్రి - మార్గాని భరత్
అమలాపురం- చింతా అనురాధ
నరసాపురం - రఘురామ కృష్ణంరాజు
ఏలూరు - కోటగిరి శ్రీధర్
విజయవాడ - దాసరి జై రమేష్
మచిలిపట్నం - బాల‌శౌరి
గుంటూరు -మోదుగుల వేణుగోపాలరెడ్డి,
నరసరావు పేట- శ్రీ కృష్ణ దేవరాయలు
ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు - మేకపాటి రాజమోహన్ రెడ్డి
రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
కడప - అవినాష్ రెడ్డి 
హిందూపూర్ - గోరంట్ల మాధవ్
అనంతపురం - పిడి రంగయ్య
నంద్యాల - శిల్పా రవిచంద్ర

కాగా.. ఈ జాబితాలో జగన్ బాబాయ్.. వైసీపీ పెద్దదిక్కుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. ఈసారి ఆయన్ను అసెంబ్లీకి పోటీ చేయించి కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే. అంతేకాదు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇంకా పార్టీలోనే చేరలేదు.. ఆయన పేరు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం. వీరిలో పలువురు కొత్త అభ్యర్థులు ఉండగా.. 2014 ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు యథావిథిగా ఉన్నారు. అయితే ఇందులో నిజమెంత..? అనే విషయం తెలియాంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే మరి. కాగా.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మరుసటి రోజే అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు వైఎస్ సన్నాహాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

More News

జనసేన తరఫున 'బన్నీ' పోటీ.. టికెట్ ఫిక్స్!

టైటిల్‌‌ చూడగానే అవునా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన తరఫున పోటీ చేస్తున్నారా..? అని ఆశ్చర్యపోతున్నారా..?

పవన్‌‌తో డీల్.. 26 అసెంబ్లీ, 4 పార్లమెంట్‌‌ సీట్లు..!?

2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో కలిసి పోటీ చేయనని.. కమ్యూనిస్ట్‌లతో మాత్రమే కలిసి పనిచేస్తానని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే.

షర్ట్ లేకుండా ఆయనతో నటించాలని ఉంది: బోల్డ్ భామ

‘బిగ్‌‌బాస్’ ఫేమ్, బోల్డ్ భామ జ్యోతి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా..

టాప్ ఛానెల్‌‌ను బ్యాన్ చేసిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల దగ్గరపడుతుండటంతో తమకు అనుకూలంగా ఉన్న ఛానెల్స్‌‌కు పార్టీల వైపు మొగ్గు చూపుతున్నాయి.

'సాహో' కోసం భారీ ఇంట‌ర్వెల్ బ్లాగ్‌

మేకింగ్‌లో `సాహో` నిర్మాత‌లు ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు వంద‌ల కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌ను ఖ‌ర్చు పెట్టారు.