కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం, మృతులు వైసీపీ ఎమ్మెల్యే బంధువులు
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో తల్లికూతుళ్లు కాలువలో గల్లంతయ్యారు. వీరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడి భార్యాపిల్లలు. దుర్గి మండలం అడిగొప్పుల వద్ద ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి అదుపుతప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు ప్రాణాలతో బయటపడగా.. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో బట్టల కోసం పిన్నెల్లి సోదరుడు మదన్‌మోహనరెడ్డి భార్య లావణ్య , కుమార్తె సుదీక్షతో కలిసి ఉదయం విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అడిగొప్పల దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కారు డ్రైవింగ్ చేస్తున్న మదన్‌మోహనరెడ్డి ఈదుకుంటూ బయటకు రాగలిగారు. అయితే నీటి ప్రవాహా ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కారు కోసం రాత్రి నుంచి గాలిస్తున్నారు.
వీరి కారు సాగర్ కాలువలో పడిందనే సమాచారం అధికారులకు తెలపడంతో బుగ్గవాగు రిజర్వాయర్ వద్ద నీరు దిగువకు వెళ్లకుండా నిలిపేశారు. అనంతరం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో భారీ క్రేన్‌ను పిలిపించి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కారును కాలువ నుంచి బయటికి తీయగా... లావణ్య, చిన్నారి సుదీక్ష మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మదన్మోహన్ రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రంతా సంఘటనా స్థలంలో ఉండి రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout