అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే ఓవరాక్షన్.. కంగుతిన్న సభ్యులు!

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఈ సమావేశాల్లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం ఆయన ఓవరాక్షనే అని నెటిజన్లు, విమర్శకులు చెప్పుకుంటున్నారు.!. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన అనంతరం మే-30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా.. జూన్-08న మంత్రి వర్గ ఏర్పాటు జరిగిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన ఎమ్మెల్యేల ప్రమాణం అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు జరిగింది. ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పల నాయుడు సమక్షంలో మొత్తం 175 మందిలో 173 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

జగన్ సాక్షిగా..!

అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ‘మా ఆరాధ్య నాయకుడు జగన్ మోహన్ రెడ్డి సాక్షిగా..’ అంటూ ప్రమాణం చేశారు. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. ఈయనేంటి ఎంత జగన్ భక్తుడు అయితే మాత్రం ఇలా చేస్తున్నారని ఒకింత విస్తుపోయారట. అయితే.. అసెంబ్లీ నిబంధనల ప్రకారం మనస్సాక్షిగా ప్రమాణస్వీకారం చేయాలి. లేదా దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేయాలి. కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘జగన్ సాక్షిగా’ అనడంతో అధికారులు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అధికారుల సూచన మేరకు మరోసారి చివర్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.

కాగా.. తొలిరోజు అసెంబ్లీలో 173మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయగా.. నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాలతో సభకు హాజరుకాలేకపోయారు. కాగా నేడు అనగా గురువారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. బుధవారం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ రాగా.. వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ సీనియర్ నేతగా, మంచి వాక్‌చాతుర్యం ఉన్న నేతగా అన్ని విధాలా సమర్ధుడు కావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు వందకు వందశాతం ఉన్నాయి.

More News

జనసేనలోని ‘ఒకే ఒక్కడు’ జంప్ అవుతాడా!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ‘ఒకే ఒక్కడు’ జంప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..?

కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీలోకి రేవంత్, కోమటిరెడ్డి!?

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయినట్లేనా..? ఉన్న అరకొర ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీని వీడి మరో జాతీయ పార్టీ గూటికి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారా..?

ఆమెను త‌మ‌న్ సింగ‌ర్‌గా మార్చేస్తున్నాడా?

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ త‌న సినిమాల్లో హీరో, హీరోయిన్‌ల‌తో పాట‌లు పాడించేస్తుంటాడు. ఈ విష‌యం చాలా సినిమాల్లో రుజువైంది.

తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. వ‌రుణ్ తేజ్ స్పంద‌న‌

యువ క‌థానాయ‌కుడు, మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్‌కు ఈరోజు తృటిలో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

దాంట్లో ఇద్ద‌రూ ఒక‌టేన‌ట‌

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌, టాలీవుడ్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితులు. స‌ల్మాన్, హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్భంలో చ‌ర‌ణ్‌ను క‌లుస్తాడు. అలాగే చ‌ర‌ణ్‌, ముంబై వెళ్లిన ప్ర‌తిసారి సల్మాన్‌ఖాన్‌