కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. గత నెల 13న కరోనా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా.. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయనకు అప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. కాగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చల్లా రామకృష్ణారెడ్డి తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆయన మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు నేతలు, కర్నూలు జిల్లా వైసీపీ నేతలు సంతాపం తెలియజేశారు.
చల్లా అంత్యక్రియలు అవుకులో జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాలకు జిల్లా నేతలతో పాటు, పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలో కీలక నేతగా వ్యవహరించారు. కర్నూలు జిల్లాలో సీనియర్ నేతగా ఆయనకు మంచి పేరుంది. టీడీపీ హయాంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా చల్లా పనిచేసి ఆ తర్వాత పార్టీ సభ్యత్వం, సివిల్ సప్లై కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేసి వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి ఎదురు గాలి వీస్తుండటంతో ఆ పార్టీని వీడి.. చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత, జిల్లాలో కీలక నేత కావడం, పలు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి కేడర్ ఉండటంతో వైసీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout