కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి

  • IndiaGlitz, [Friday,January 01 2021]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. గత నెల 13న కరోనా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా.. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయనకు అప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. కాగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చల్లా రామకృష్ణారెడ్డి తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆయన మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు నేతలు, కర్నూలు జిల్లా వైసీపీ నేతలు సంతాపం తెలియజేశారు.

చల్లా అంత్యక్రియలు అవుకులో జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాలకు జిల్లా నేతలతో పాటు, పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలో కీలక నేతగా వ్యవహరించారు. కర్నూలు జిల్లాలో సీనియర్ నేతగా ఆయనకు మంచి పేరుంది. టీడీపీ హయాంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా చల్లా పనిచేసి ఆ తర్వాత పార్టీ సభ్యత్వం, సివిల్ సప్లై కార్పొరేషన్‌ పదవులకు రాజీనామా చేసి వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి ఎదురు గాలి వీస్తుండటంతో ఆ పార్టీని వీడి.. చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత, జిల్లాలో కీలక నేత కావడం, పలు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి కేడర్ ఉండటంతో వైసీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.

More News

టీపీసీసీ చీఫ్ ఎవరో తేలకముందే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఒకవైపు చర్చలు జరుగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించడం

కులాంతర వివాహం చేసుకున్నాడని.. వెంటాడి మరీ హతమార్చారు

పరువు హత్యలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పరంగా రోజురోజుకూ అడుగులు ముందుకు పడుతుంటే.. కులం, మతం విషయంలో మాత్రం వెనక్కి పడుతున్నాయి.

‘రాధేశ్యామ్’ ప్రభాస్ లేటెస్ట్ లుక్.. విడుదల తేదీ ఫిక్స్?

‘సాహో’ తరువాత యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో లేటెస్ట్‌ మూవీ 'రాధేశ్యామ్' తెరకెక్కుతున్న విషయం

బిగ్‌బాస్ 4... చిరు కుమ్మేశారు.. టీఆర్పీ దూసుకెళ్లింది

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌.. ఇటీవలే సీజన్‌ 4ను కంప్లీట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. సీజన్-4లో ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లు తప్ప మిగిలినవన్నీ

రేపు దేశమంతటా డ్రైరన్

కరోనా వ్యాక్సినేషన్‌ సన్నద్ధతకు దేశమంతటా డ్రై రన్‌ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఉన్నత