చంద్రబాబు.. శోభన్ బాబా?.. మందు అలవాటైందేమో!?
Send us your feedback to audioarticles@vaarta.com
కేవలం నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు, అనేక చట్టాలు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారని.. అది చూసి ఓర్వలేక చంద్రబాబు మతిపోయి.. మత్తెక్కి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వారసుడు లోకేష్‌బాబు భవిష్యత్తు ముగిసిపోయిందనే ప్రెస్టేషన్‌తో చంద్రబాబు ప్రేలాపనలకు కారణంగా కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు.
నగరానికి చేసిందేమీ లేదు!
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విశాఖ నగరానికి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ఈ సందర్భంగా ఆయన సూటి ప్రశ్న సంధించారు. విశాఖ ఆస్తులను ఎవరికి కట్టబెడదాం..? అనే ఆలోచనతోనే బతికాడే కానీ.. నగరానికి చేసిందేమీ లేదని అమర్ విమర్శించారు. విశాఖపట్నానికి మంచి జరిగిందంటే అది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని.. ఇప్పుడు మళ్లీ సీఎం జగన్ నేతృత్వంలోనే విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు.
శోభన్ బాబా?
‘ఏపీలో సీఎం జగన్ పాలన చూసి చంద్రబాబుకు మతిపోయినట్టుంది.. లేక మత్తులో ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడో తెలియడంలేదు. నాకు తెలిసినంతవరకు చంద్రబాబుకు మందు అలవాటు లేదు.. ఒకవేళ అధికారం పోయాక ఆయనకు మందు అలవాటైందేమోననే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు విశాఖ వస్తే తనకోసం లక్షల మంది స్వాగతం పలకడానికి వచ్చినట్టు ఫీలైపోతున్నారు. జగన్‌తో ఫొటోలు దిగడానికి వచ్చారంటే ఓ అర్థం ఉందని, కానీ చంద్రబాబు కోసం అంతమంది రావడానికి ఆయన వద్ద అందం ఉందా? హీరోయిజం ఉందా? లేక ఆయనేమైనా శోభన్ బాబా?. చంద్రబాబు ఇంట్లోవాళ్లకు శోభన్ బాబులా కనిపిస్తారేమో కానీ మాకు కాదు. కనీసం చంద్రబాబు మాటల్లో కూడా అందం ఉండదు. వెన్నుపోట్లు, మేనేజ్ మెంట్ రాజకీయాలు తప్ప చంద్రబాబు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు’ అని వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
సవతి ప్రేమ నటిస్తే...!
‘విశాఖ బాగుపడిందంటే అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డే.. ఇప్పుడు సీఎం జగన్ పాలనలో అభివృద్ధి చెందుతోంది. చంద్రబాబు ఇప్పుడొచ్చి సవతి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మబోరు. ఉక్కు కర్మాగారాన్ని ఎవరికి ఇచ్చేద్దాం, బీహెచ్ పీవీని ఎప్పుడు ఎల్ అండ్ టీకి ఇచ్చేద్దాం, విశాఖ కొండలను ఎప్పుడు గీతం సంస్థలకు కట్టబెడదాం..? అని తహతహలాడడం తప్ప చంద్రబాబు విశాఖకు చేసిందేమీ లేదు’ అని అమర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ముఖ్యంగా నారా లోకేష్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout