అసెంబ్లీలో అడ్డంగా బుక్కయిన వైసీపీ ఎమ్మెల్యే!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. గత రెండ్రోజులుగా ప్రధాన, చారిత్రక బిల్లులపై కీలక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా పలువురు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మాట దొర్లుతున్నారు. కొందరైతే అదేదో స్టేజ్ ఫియర్తో ఏదో మాట్లాడుదామని ఇంకేదో మాట్లాడేస్తున్నారు. బుధవారం నాడు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించేందుకు యత్నించి అడ్డంగా బుక్యయ్యారు. అమెరికా గురించి ప్రస్తావిస్తూ ఆయన పొరబడ్డారు.
అసలేం జరిగింది..!
అమెరికాను కనుగొన్నది ‘వాస్కోడామా’ అని పొరపాటు పడ్డారు. దీంతో పక్కనే ఉన్న సభ్యులు ‘వాస్కోడిగామా’ అని చెప్పారు. అమెరికాను కనుగొన్నది వాస్కోడిగామా కాదు ‘కొలంబస్’ అన్న విషయం మధుసూదనరెడ్డికే కాదు.. ఆయన పక్కనే ఉన్న సభ్యులకు కూడా తెలిసినట్టు లేదు. పాపం.. మధుసూదన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు స్పీకర్ సహా ఇతర సభ్యులు నవ్వులు చిందించడం గమనార్హం.
అన్న చల్లంగా ఉండాలి!!
"అధ్యక్షా.. నా లాంటి కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలు కావడం చాలా సంతోషంగా ఉంది. జగన్ రుణం తీర్చుకోలేము. చాలా మందికి లైఫ్ ఇచ్చిన అన్న చల్లంగా ఉండాలి. జగన్ పడ్డ కష్టాలను నేను దగ్గరుండి చూసి ఎంతో బాధపడ్డాను. జగన్ తప్పు చేయకపోయినా ఎన్ని బాధలు పడ్డారంటే, అలాంటి బాధలు శత్రువుకు కూడా రాకూడదు. అసెంబ్లీకి కొత్తగా వచ్చామని, చంద్రబాబును చూసి మేం కూడా ఆయనలా తయారవుతామేమోనని భయంగా ఉంది (సభలో నవ్వులు విరిసాయి). అసెంబ్లీలో మాట్లాడటం నాకు ఇదే ఫస్ట్ టైమ్. నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా మాట్లాడతాను. (స్పీకర్ స్పందిస్తూ..)‘ఫస్ట్ టైమే ఇంత మాట్లాడావయ్యా, నెక్స్ట్ టైమ్ అయితే ఏం మాట్లాడతావో’" అని ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇదిలా ఉంటే మధుసూధన్ ప్రసంగానికి సీఎం వైఎస్ జగన్ కూడా చప్పట్లు కొట్టి అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout