YSRCP Manifesto: ఆ వర్గాలే లక్ష్యంగా.. సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఎన్నికలకు అధికార వైసీపీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సిద్ధం సభలతో క్యాడర్‌కు దిశానిర్దేశం చేసిన ఆ పార్టీ అధినేత సీఎం జగన్ తాజాగా మేనిఫెస్టోపై కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమెట్లలో మార్చి 10న చివరి సిద్ధం సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపు 15 లక్షల మంది హాజరవుతారని.. ఈ సభలోనే మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు.
దీంతో మేనిఫెస్టో హామీలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న నవరత్నాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో మేనిఫెస్టో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా నవరత్నాలు వైఎస్సార్ రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాలు, వైఎస్సార్ ఆసరా పెన్షన్లు, జలయజ్ఞం, వంటివి ఉన్నాయి. ఈ హామీల్లో దాదాపు 95శాతం అమలు చేశామని ఆ పార్టీ చెబుతోంది. దాదాపు 129 హామీలు ఇస్తే అందులో 111 నెరవేర్చినట్లు ఇప్పటికే ప్రకటించింది.
ఇప్పుడు ఈ నవరత్నాలను పొడిగించడంతో పాటు మహిళా ఓటర్లే లక్ష్యంగా మరికొన్ని హామీలను పొందుపరిచారట. ఇందులో 2లక్షల రూపాయల రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ.. రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి సాయం పెంచునున్నారని సమాచారం. ముఖ్యంగా రైతు భరోసాను 15,000 నుంచి 25,000 రూపాయలకు.. ఆరోగ్యశ్రీ 10 లక్షలు నుంచి 20 లక్షలు రూపాయలకు.. అమ్మఒడి 15,000 నుంచి 20,000.. వైయస్సార్ చేయూత 18,500 నుండి 20,000.. పింఛన్లు 3000 నుండి 4000.. ఫీజు రియింబర్స్‌మెంట్ 20,000 నుండి 25,000 రూపాయలకు పెంచనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం.. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్.. అర్హులైన పేద మహిళలకు నెలకు 3000 రూపాయలు.. 5లక్షల విద్య కార్డులు.. విద్యార్థులకు ల్యాప్టాప్స్.. ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలను ఇవ్వనున్నారట. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు కౌంటర్‌గా ఈ పథకాలు ఉండనున్నాయని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఇంతవరకు నిజమో తెలియాలంటే మార్చి 10వ తేదీ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments