తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ ముందంజ..
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి రెండు లక్షలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 2,19,552 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే గురుమూర్తి స్పష్టమైన మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. మూడు గంట సమయానికి ఫలితాల సరళిని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అయితే టీడీపీ, బీజేపీ అభ్యర్థులు మాత్రం రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యారు.
Also Read: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం
కాగా.. ఒక్కటంటే ఒక్క రౌండ్‌లోనూ టీడీపీ, బీజేపీ అభ్యర్థులిద్దరూ ఆధిక్యతను చూపించుకోలేకపోయారు. ఒకానొక సందర్భంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికెళ్లిపోయారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై స్పందించిన ఆమె వాటిని తీవ్రంగా ఖండించారు. కాగా.. కాంగ్రెస్, సీపీఎం కంటే ఇప్పటి వరకూ నోటాకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి 7,855 ఓట్లు రాగా.. సీపీఎంకు 4,599 ఓట్లు, నోటాకు 12,374 ఓట్లు వచ్చాయి. మొత్తానికి తిరుపతి లోక్‌సభ స్థానం వైసీపీకి ఖాయమైనట్టే.
ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాలు..
వైసీపీ : 5,02,647 ఓట్లు (56.9 శాతం)
టీడీపీ : 2,80.669 ఓట్లు (31.8 శాతం)
బీజేపీ : 46,711 ఓట్లు (5.3 శాతం)
కాంగ్రెస్ : 7,855 ఓట్లు (0.89 శాతం)
సీపీఎం : 4,599 ఓట్లు (0.5 శాతం)
ఇతరులు : 28,674 ఓట్లు (3.2 శాతం)
నోటా : 12,374 ఓట్లు (1.4 శాతం)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com