ఆర్టీసీ బస్‌లో కోట్లు తరలిస్తూ అడ్డంగా దొరికిన వైసీపీ నేత

  • IndiaGlitz, [Friday,April 05 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటంతో నేతలు ఓటర్లను ప్రలోభాలు పెడుతున్నారు. ఎక్కడ చూసినా నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే అటు పోలీసు అధికారులు.. ఇటు ఎన్నికల స్పెషల్ టీమ్ కొన్ని కొట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మరో మూడ్రోజులు మాత్రమే ఎన్నికలకు ఉండటంతో ఈ టైమ్‌లోనే ఎక్కువగా డబ్బులు తరలిస్తారని పసిగట్టిన అధికారులు ఎక్కడికక్కడ వాహనాలను చెకింగ్ చేస్తున్నారు.

తాజాగా.. రాజాం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత పాలవలస విక్రాంత్ 10 కోట్లతో రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిపోయారు. ఆర్టీసీ బస్సులో ఈ భారీ నగదు తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు చెక్ చేయగా బ్యాగ్‌‌లు తెరిచి చూడగా అన్నీ నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. దీంతో ఆ నగదు మొత్తాన్ని విక్రాంత్‌ను స్థానికంగా పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కాగా ఈ మొత్తం నగదు ఆర్టీసీ బస్సు నంబర్: 8036 లో దొరికింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

భూమనను ఎదుర్కోవాలంటే 'మాయా' లాగా మారాలి!

"సోద‌రి మాయావ‌తి ప్ర‌ధానిగా తిరిగి తిరుప‌తిలో అడుగుపెట్టాలి. మాయావ‌తి గారు ఎన్నో క‌ష్టాలుప‌డి వంద‌ల కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కి, రాజ‌కీయాల‌కు వేల కోట్లు అవ‌స‌రం లేదు.

పవన్ ముఖ్యమంత్రి అయి తీరుతారు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన‌, బీఎస్పీ, సిపిఐ, సిపిఎంల కూట‌మి మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వ‌స్తుంద‌ని బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి విశ్వాసం వ్య‌క్తం చేశారు.

ఆ కన్నీళ్లు, ఆ క‌ష్టాలే జ‌న‌సేన పార్టీ పెట్టేలా చేశాయ్!

తెలంగాణ నేల రాజ‌కీయం ప్ర‌సాదించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో

ఎస్సీ-ఎస్టీలకు రాజకీయ అధికారం దక్కలేదు!

తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పొరాడి తెచ్చుకుంటే... అవేవీ ఆచరణలో నెరవేరలేదు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు.

లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు...

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని