తాజా సర్వేలో వైసీపీ ప్రభంజనం.. డీలా పడ్డ టీడీపీ!

  • IndiaGlitz, [Friday,January 25 2019]

ఏపీలో ఎన్నికలు సీజన్ మొదలవ్వడంతో ప్రముఖ టీవీ చానెళ్లు, పలు సర్వే సంస్థలు పార్టీల జాతకాలు బయటపెడుతున్నాయి.! ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పలు జాతీయ సంస్థలు చేసిన సర్వేలు నిజమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌‌లో ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతోంది..? ఎవరు విజయం సాధించబోతున్నారు..? ఎవరికెన్ని సీట్లు వస్తాయి..? అనే విషయాలపై రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ సంస్థలు చేసిన సర్వేలో అధికార పక్షానికి చేదువార్త.. ప్రతిపక్షానికి తియ్యటి శుభవార్త అని తేల్చింది. కాగా ఇప్పటికే పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో అసెంబ్లీ మొదలుకుని పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యం వరకు అన్ని అవకాశాలు వైఎస్ జగన్‌కే ఉన్నాయని స్పష్టం చేశాయి.

వైసీపీదే ప్రభంజనం..!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను వైసీపీకి 19 సీట్లు, టీడీపీకి కేవలం 6 సీట్లు మాత్రమే వస్తాయని రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ సంస్థలు తేల్చేసింది. ఓట్ల శాతం పరంగా చూసినా వైసీపీకి 41.3 శాతం ఓట్లు.. టీడీపీకి 33.1 శాతం ఓట్లు పడతాయని సర్వే తేటతెల్లమైంది.

మోదీ-షాలకు షాక్!

మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీల పరిస్థి చూస్తే.. రెండోసారి అధికారం దక్కించుకోవాలన్న మోదీ-షా ద్వయానికి షాక్ తగలనుందని తేల్చింది. ఎన్డీఏ, యూపీఏతో జట్టు కట్టే పార్టీల ఆధారంగా ఫలితాలు మారే అవకాశముందని రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ సర్వేలో స్పష్టమైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఫలితాలు మొత్తం రివర్స్ అయ్యేట్లు ఉన్నాయని తేలింది.

అయితే.. ఎన్నికలొస్తే చాలు పుట్టగొడుల్లా సర్వేలు పుట్టుకొస్తాయి. కచ్చితంగా ఫలానా పార్టీనే గెలుస్తుందని చెప్పిన సర్వే సంస్థలు ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అవ్వడంతో ముక్కున వేలేసుకున్న రోజులున్నాయ్. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ సర్వే చేశారు.. తీరా ఫలితాలు చూస్తే ఊహించని రీతిలో అట్టర్ ప్లాపై కూటమి కుప్పకూలిపోయింది. ఇంత వరకూ లగడపాటి జాడ ఎక్కడ కనిపించలేదు కూడా!. అలాగే జాతీయస్థాయి సంస్థలు చేసిన సర్వేలు ఏ మేరకు నిజమవుతాయి..? సీన్ రివర్స్ అవుతుందా..? సర్వేలో చెప్పిందే అక్షరసత్యమవుతుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే.. అలీకి లైన్ క్లియర్!?

టీడీపీ నుంచి మరో ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్తున్నారా..? ఆయన జంప్ అయితే కమెడియన్ అలీ పంటపండినట్లేనా..?

టీడీపీకి 'నో’.. వైసీపీ, జనసేనతో పొత్తుకు ‘సై’!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ‘పొత్తులు’ పొడుస్తున్నాయి. నిన్నటి వరకూ ఉప్పు-నిప్పులా ఉన్న పార్టీలు సైతం తిన్నగా పొత్తు పెట్టుకునేందుకు ‘సై’అంటున్నాయి.

'ప్రణయ్’ మళ్లీ పుట్టాడు.. ఆందోళనలో అమృత!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారతదేశంలో సంచలనం సృష్టించిన నల్లొండ జిల్లా మిర్యాలగూడ ‘పరువు హత్య’ అందరికీ గుర్తుండే ఉంటుంది.

కేటీఆర్‌‌కు ఉపాసన కొణిదెల సరదా ప్రశ్న!

టాలీవుడ్ హీరో రామ్‌‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌‌గా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కార్యక్రమాలను షేర్ చేస్తూ అటు మెగాభిమానులు..

'మ‌ణిక‌ర్ణిక‌' కు కోర్టులో ఊర‌ట‌

కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `మ‌ణిక‌ర్ణిక‌:  ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ`.