వైఎస్‌కు భారతరత్న ఇవ్వాలని వైసీపీ డిమాండ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాల రూపకల్పన చేసి.. అందరి గుండెల్లో నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. వైఎస్‌కు భారతత్న ఇవ్వాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనుకున్న వ్యక్తి వైఎస్సార్ అని.. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తిగా నిలిచిపోయారని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజల గుండెల్లో నేటికీ..!
"కరువు కోరల్లో చిక్కి అప్పుల ఊబిలో ఉన్న రైతులకు రుణ మాఫీ చేయడం.. ఆర్ధిక స్థోమత లేక ప్రాణాలను పోగొట్టుకొంటున్న పేదలకు ఆరోగ్య శ్రీ,108,104 ద్వారా సేవలందించడం,ఉన్నత చదువులు చదవలేని పేద విద్యార్థులకు పీజు రీయింబర్స్‌మెంట్ లాంటి వందకు పైగా సంక్షేమ పథకాలను రూపొందించి వాటి ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు.అమెరికా అధ్యక్షుని పర్యటనలో డ్వాక్రా మహిళల గౌరవం పెంచిన నాయకుడు వైఎస్. పావలా వడ్డీతో రుణాలు అందివ్వడం జరిగింది. అందువల్లనే వైఎస్సార్ మరణించి 10 సవంత్సరాలు కావస్తున్నా ప్రజల గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నేటికి నిలిచిపోయారు. మహా నేత పాలనలో అందిన సంక్షేమ పథకాల వలెనే రాష్ట్ర ప్రజలు నేటికి ఆయన కుటుంభాన్ని ఆదరిస్తున్నారన్నారు" అని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
భారతరత్న ఇచ్చి.. పార్లమెంట్‌లో విగ్రహం..!
"అన్ని పార్టీల నేతలు ప్రజా పాలనను అందించిన వైఎస్సార్‌కు భారతరత్నను ఇచ్చేలా కేంద్రం సహకరించాలి. అంతటి మహానేత వైఎస్సార్‌కు భారతరత్నను కేంద్రం ప్రకటించడంతో పాటు పార్లమెంట్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం పార్టీ పార్లమెంటు సభ్యులతో పార్లమెంట్‌లో మాట్లాడిస్తాం. అలాగే పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా కూడా ప్రధాని మోదీని కలిసినప్పుడల్లా వినతి చేస్తాం. మహోత్తర పథకాలతో కోట్లాది మంది ప్రజలకు వైఎస్సార్ దగ్గరయ్యారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవడంతోనే నేడు రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 152 సీట్లు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తిని ప్రజలివ్వడం వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, ప్రేమే" అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
అయితే.. శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ అధినేత ఎలా రియాక్ట్ అవుతారు..? ఈ విషయంలో కేంద్రంపై ఏ మేరకు వైసీపీ ఒత్తిడి తెస్తుంది..? కేంద్రం ఏ మేరకు వైసీపీ విన్నపం వింటుంది..? అసలు ఇది జరిగేపనా..? కాదా..? కాగా.. ఎన్నో రోజుల నుంచి ఆంధ్రుల ఆరాధ్యుడు నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.. ఇప్పటికీ ఉంది.. మరి ముందు.. వైఎస్‌కు ఇస్తారో.. లేకుంటే ఎన్టీఆర్‌కు ఇస్తారో అనేదానిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout