దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పచ్చ నేతల నీతులు.. మీరా మాట్లాడేది..?

  • IndiaGlitz, [Friday,December 01 2023]

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టైన సత్తారు వెంకటేష్ రెడ్డి ఎన్నారై వైసీపీ నేత అంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఆర్‌ఐ సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేష్ రెడ్డి చేసిన నేరం అతని వ్యక్తిగతం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఆ పార్టీ అధికారిక పేజీ నుంచి ట్వీట్ చేసింది.

విడ్డూరంగా పచ్చ నేతల రాద్ధాంతం..

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పచ్చ నేతలు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. పచ్చ చీర కట్టిందల్లా నా పెళ్లాం అన్నట్లు ప్రపంచంలో ఎవరూ నేరం చేసినా దానిని వైసీపీకి అంటగట్టడంలో టీడీపీ నేతలు ముందుంటారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు ఎవరూ తప్పు చేసినా తప్పే.. వారికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. తాజాగా అమెరికాలో వెలుగు చూసిన హ్యూమెన్ ట్రాఫికింగ్ ఘటనపై టీడీపీ నానా రాద్దాంతం చేస్తోంది. గతంలో తమ పార్టీకి చెందిన వ్యక్తులు ఎలాంటి ఘటనలకు పాల్పడ్డారో మర్చిపోయినట్లున్నారు.

ఉమెన్ ట్రాఫికింగ్‌లో పచ్చ బ్యాచ్..?

గతంలో టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు పచ్చ బ్యాచ్‌కు చెందిన మోదుగుముడి కిషన్ చౌదరి, చంద్రకళ పూర్ణిమ. యార్లగడ్డ రామ్ చౌదరి, సెక్స్ వర్కర్‌తో కలిసి హోటల్‌లో దొరికిపోయిన వినిత్ రావూరిపై అమెరికాలో కేసు నమోదైన విషయం వాస్తవం కాదా..? ఉమెన్ ట్రాఫికింగ్, సినీతారలతో సెక్స్ రాకెట్ వంటి వ్యవహారాల్లో ఆరితేరిన ఘనులు తెలుగు తమ్ముళ్ళే అన్న సంగతి మర్చిపోయారా..? అప్పట్లో వారిపై ఆరోపణలు వచ్చినపుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కనీసం ఖండించలేక పోగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం పార్టీ నుండి కూడా తొలగించలేకపోయింది. మీరా.. ఇతరుల గురించి మాట్లాడేది. ముందు మీ కింద ఉన్న మచ్చలు చూసుకోండి.

More News

KCR :అధికారంపై కేసీఆర్ ధీమా.. డిసెంబర్ 4న కేబినెట్ భేటీకి నిర్ణయం..

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశానికి సిద్ధమయ్యారు రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన

Re Polling:రీపోలింగ్‌కు అవకాశం లేదు.. 70.79శాతం పోలింగ్ నమోదు: సీఈవో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.79% పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

NagarjunaSagar:సాగర్ వద్ద ఆగని ఉద్రిక్తత.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్యాం వద్ద ఇప్పటికే ఏపీ పోలీసులు భారీగా మోహరించగా..

America:అమెరికాలో నరరూప రాక్షసులుగా మారిన తెలుగు వ్యక్తులు

బంగారు భవిష్యత్ కోసం ఎంతో కష్టపడి అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక వారి బుద్ధి మారింది.

7 kg Gold:బ్యాంకులో 7కిలోల బంగారం మాయం.. మహిళా ఉద్యోగిని సూసైడ్..

వివిధ అవసరాల కోసం బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. దీంతో కస్టమర్స్ తీవ్ర ఆందోళనకు దిగారు.