వైసీపీ మూడో జాబితాలో రాయలసీమలోనే కీలక మార్పులు.. మంత్రులకు స్థానచలనం..

  • IndiaGlitz, [Friday,January 12 2024]

ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులకు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 6 మంది ఎంపీలతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఈ జాబితాలో 10 స్థానాలు రాయలసీమలోనే ఉండటం గమనార్హం. ఇందులో 8 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. మంత్రి జోగి రమేశ్‌కు స్థానచలనం కలిగింది. ప్రస్తుత ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పెడన నుంచి పెనమలూరుకు మార్పు చేశారు. దీంతో పెడన నుంచి ఉప్పాడ రాముకు చోటు దక్కింది. మరో మంత్రి గుమ్మనూరి జయరాంను కర్నూలు ఎంపీ ఇంచార్జ్‌గా నియమించారు. తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ ఇంచార్జ్‌గా ప్రకటించారు.

ఎంపీ అభ్యర్థులు..

విశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సి
విజయవాడ - కేశినేని నాని
శ్రీకాకుళం - పేరాడ తిలక్
కర్నూల్‌ ఎంపీ - గుమ్మనూరి జయరాం
తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం
ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్

ఎమ్మెల్యే అభ్యర్థులు..

ఇచ్ఛాపురం - పిరియ విజయ
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి
దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు - విజయానంద రెడ్డి
మదనపల్లె - నిస్సార్ అహ్మద్
రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు - బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
పెనమలూరు - జోగి రమేశ్
పెడన - ఉప్పాల రాము

ఇదిలా ఉంటే ఈ జాబితా విడుదల తర్వాత ఇద్దరు మంత్రుల కుటుంబాలకు ఏకంగా మూడు టికెట్లు దక్కడం విశేషం. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కుటుంబానికి చెందిన సురేశ్‌ కొండెపి ఇంచార్జ్‌గా.. ఆయన సోదరుడు ఆదిమూలపు సతీశ్‌ను కోడుమారు ఇంచార్జ్‌గా.. ఆయన బావ తిప్పేస్వామిని మడకశిర ఇంచార్జ్‌గా నియమించారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఆయన భార్య ఝూన్సీని విశాఖ ఎంపీ అభ్యర్థిగా.. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్, చీపురపల్లి ఇంచార్జ్‌గా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. కాగా తొలి జాబితాలో 11 మందితో చోటు కల్పించగా.. రెండో జాబితాలో 27 మందిని ప్రకటించారు.

More News

BRS Party: మళ్లీ టీఆర్ఎస్‌గా మారనున్న బీఆర్ఎస్.. పార్టీ ఉనికి కోసమేనా..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గ కారణాలపై అన్వేషిస్తోంది. దీంతో త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ తప్పిదాలు జరగకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది.

YSRCP MPs: వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా సినీ ప్రముఖులు.. ఎవరంటే..?

వైసీపీలో మూడో జాబితా ఇంఛార్జ్‌ల మార్పుపై సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేయాలనుకున్న నియోజవకర్గాల నేతలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని చర్చిస్తున్నారు.

YS Sharmila: షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వొద్దు.. మాజీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు..

వైయస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, షర్మిల ఇద్దరు ఒక్కటేని..

Vyuham: 'వ్యూహం' సినిమా విడుదలపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్..

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును

Mudragada: ముద్రగడకు టీడీపీ-జనసేన వల.. మరి 'కాపు' కాస్తారా..?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రోజురోజుకు పార్టీలు మారే నేతలు ఎక్కువైపోతున్నారు. ఎవరూ ఏ పార్టీలోకి వెళ్తారో తెలియడం లేదు. ఎవరు ఔనన్నా