YSSRCP: అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు మార్పు..

  • IndiaGlitz, [Tuesday,December 12 2023]

ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అధికార వైసీపీ కదనరంగంలోకి దిగింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నేతల ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు పోతుంది. వచ్చే కురుక్షేత్రంలో టీడీపీ-జనసేన కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏ చిన్న తప్పిదం జరగకుండా జాగ్రత్త పడుతోంది. వైనాట్ 175 నినాదమే గమ్యంగా ముందుకు పోతోంది.

175 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల మార్పునకు శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని హైకమాండ్ తెలిపింది. ఓ వ్యక్తి లేదా వ్యక్తుల ప్రయోజనాల కోసం పార్టీ ఉండదని స్పష్టంచేసింది. భవిష్యత్‌లో మరిన్ని మార్పులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.

నియోజకవర్గాల కొత్త ఇంఛార్జ్‌ల వివరాలు ఇవే..

ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్
కొండెపి - ఆదిమూలపు సురేష్
వేమూరు - వరికూటి అశోక్ బాబు
తాడికొండ - మేకతోటి సుచరిత
సంతనూతలపాడు - మేరుగు నాగార్జున
చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు
గుంటూరు పశ్చిమ - విడదల రజనీ
అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
మంగళగిరి - గంజి చిరంజీవి
రేపల్లె - ఈవూరు గణేష్
గాజువాక - వరికూటి రామచంద్రరావు

ఇక నుంచి ఈ నియోజకవర్గాల బాధ్యతలను ఈ నేతలే చూసుకుంటారని పార్టీ పెద్దలు తెలిపారు. భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావాలని.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఎవరూ అసంతృప్తికి లోను కావొద్దని.. అందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు.

More News

Bigg Boss Telugu 7 : నో నామినేషన్స్, ఓన్లీ ఎమోషనల్.. అమర్‌, అర్జున్‌లకు బుక్ ఆఫ్ మెమొరీస్ చూపిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ముగింపుకు చేరుకుంది. మరో ఏడు రోజుల్లో సీజన్ ముగిసి.. కొత్త విజేత ఆవతరించనున్నాడు.

DGP Anjani Kumar:తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌ సస్పెన్షన్ ఎత్తివేత

తెలంగాణ మాజీ  డీజీపీ అంజనీకుమార్‌కు భారీ ఊరట దక్కింది. ఆయనసై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది.

Chandrababu:ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Salaar:'సలార్-సీజ్ ఫైర్' రన్ టైమ్ ఫిక్స్.. ఎన్ని గంటలు అంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్-సీజ్ ఫైర్.

Pawan Kalyan:నాదెండ్ల అరెస్ట్‌ను ఖండించిన పవన్ కల్యాణ్.. విశాఖ వస్తానని హెచ్చరిక..

విశాఖపట్టణంలో జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.