YSSRCP: అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు మార్పు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అధికార వైసీపీ కదనరంగంలోకి దిగింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నేతల ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు పోతుంది. వచ్చే కురుక్షేత్రంలో టీడీపీ-జనసేన కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏ చిన్న తప్పిదం జరగకుండా జాగ్రత్త పడుతోంది. వైనాట్ 175 నినాదమే గమ్యంగా ముందుకు పోతోంది.
175 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల మార్పునకు శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని హైకమాండ్ తెలిపింది. ఓ వ్యక్తి లేదా వ్యక్తుల ప్రయోజనాల కోసం పార్టీ ఉండదని స్పష్టంచేసింది. భవిష్యత్‌లో మరిన్ని మార్పులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.
నియోజకవర్గాల కొత్త ఇంఛార్జ్‌ల వివరాలు ఇవే..
ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్
కొండెపి - ఆదిమూలపు సురేష్
వేమూరు - వరికూటి అశోక్ బాబు
తాడికొండ - మేకతోటి సుచరిత
సంతనూతలపాడు - మేరుగు నాగార్జున
చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు
గుంటూరు పశ్చిమ - విడదల రజనీ
అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
మంగళగిరి - గంజి చిరంజీవి
రేపల్లె - ఈవూరు గణేష్
గాజువాక - వరికూటి రామచంద్రరావు
ఇక నుంచి ఈ నియోజకవర్గాల బాధ్యతలను ఈ నేతలే చూసుకుంటారని పార్టీ పెద్దలు తెలిపారు. భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావాలని.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఎవరూ అసంతృప్తికి లోను కావొద్దని.. అందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout