తాగి ఊగిన వ్యవహారంపై వైసీపీ అభ్యర్థి రియాక్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు తాగి ఊగి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు గత రెండ్రోజులుగా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోను పట్టుకున్న తెలుగు మీడియా చానెల్స్ కథనాలు వండివార్చాయి. అయితే ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి రఘురాంకు తెలియడంతో ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు.
రఘురాం రియాక్షన్ ఇదీ...
ఆదివారం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు.. తన ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల అధికారికి, భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 29న భీమవరంలో జరిగిన సినీ అభిమానుల సమావేశంలో తన ప్రసంగాన్ని తప్పుగా చూపించారని తెలిపారు. ప్రసంగం వీడియోను రఘురామ కృష్ణంరాజు తరపు లాయర్ పోలీసులకు అందజేశారు. అయితే ఈ మార్పింగ్ చేసిందెవరు..? ఎందుకు మార్పింగ్ చేయాల్సి వచ్చింది..? ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com