తాగి ఊగిన వ్యవహారంపై వైసీపీ అభ్యర్థి రియాక్షన్

  • IndiaGlitz, [Sunday,March 31 2019]

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు తాగి ఊగి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు గత రెండ్రోజులుగా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోను పట్టుకున్న తెలుగు మీడియా చానెల్స్ కథనాలు వండివార్చాయి. అయితే ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి రఘురాంకు తెలియడంతో ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు.

రఘురాం రియాక్షన్ ఇదీ...

ఆదివారం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు.. తన ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల అధికారికి, భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 29న భీమవరంలో జరిగిన సినీ అభిమానుల సమావేశంలో తన ప్రసంగాన్ని తప్పుగా చూపించారని తెలిపారు. ప్రసంగం వీడియోను రఘురామ కృష్ణంరాజు తరపు లాయర్‌ పోలీసులకు అందజేశారు. అయితే ఈ మార్పింగ్ చేసిందెవరు..? ఎందుకు మార్పింగ్ చేయాల్సి వచ్చింది..? ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More News

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!

టైటిల్ చూడగానే ఇదేంటి..? పెళ్లి కాకుండానే తల్లికావడం ఎలా సాధ్యం..? ఓహ్ సినిమాలో ఇలా నటిస్తోందా..? అని అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

ఫ్యాన్సీ రేటుకు 'మ‌హ‌ర్షి' డిజ‌టల్ హ‌క్కులు...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ సినిమా `మ‌హ‌ర్షి`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మే 9న సినిమా విడుద‌ల‌వుతుంది.

వైసీపీలోకి రాజశేఖర్ దంపతులు.. జగన్ పులి బిడ్డ!

వైసీపీలోకి రోజురోజుకు వలసలు ఎక్కువవుతున్నాయి. అటు రాజకీయ నేతలు... ఇటు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు.

ఆర్జీవీ మరో సంచలన సినిమా ప్రకటన...

వివాదాలకు మారుపేరు.. వివాదాలు పుట్టిందే మా ఇంట్లోనే అన్నట్లుగా వ్యవహరించే వ్యక్తి.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.

పులివెందుల వెళ్లి ఎక‌రం భూమి కొన‌గ‌ల‌రా..?

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చిన 12 నెల‌ల్లో ఆమదాల‌వ‌ల‌స‌-రాజాం నియోజ‌క‌వ‌ర్గాల‌ మ‌ధ్య నాగావ‌ళి న‌దిపై బ‌ల‌స‌ల‌రేవు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.