సామాజిక రథ చక్రాలు వస్తున్నాయి.. వైసీపీ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు వేళ నిత్యం ప్రజల్లో ఉండేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైన వైసీపీ.. తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి(గురువారం) నుంచి 'సామాజిక సాధికార' పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనుంది. ఈ యాత్రలో భాగంగా నాలుగున్నర సంవత్సరాలలో సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలకు వైసీపీ నేతలు వివరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చట్ట సభల్లో సీట్లు నుంచి స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల వరకూ అన్నింటిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని జగనన్న అందించినట్లు ప్రజల దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
డిసెంబరు 31 వరకూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో మూడు దశల్లో ఈ యాత్ర జరగనుంది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరగనుంది. ఈనెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాల నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ప్రతి రోజు మూడు ప్రాంతాల్లో యాత్ర, ఒక్కో ప్రాంతంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ సమ్వయకర్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ యాత్ర జరగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు.
బస్సు యాత్ర షెడ్యూల్..
అక్టోబర్ 26- ఇచ్చాపురం, తెనాలి, శింగనమల
అక్టోబర్ 27- గజపతినగరం, నరసాపురం, తిరుపతి
అక్టోబర్ 28- భీమిలి, చీరాల, పొద్దుటూరు
అక్టోబర్ 30- పాడేరు, దెందులూరు, ఉదయగిరి
అక్టోబర్ 31- ఆముదాలవలస, నందిగామ, ఆదోని
నవంబర్ 1- పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి
నవంబర్ 2- మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు
నవంబర్ 3- నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి
నవంబర్ 4- శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం
నవంబర్ 6- గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం
నవంబర్ 7- రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ
నవంబర్ 8- సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్
నవంబర్ 9- అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె
మొత్తంగా డిసెంబర్ 31 వరకూ 60 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు బస్సు యాత్ర సమన్వయ బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout