టాప్ ఛానెల్‌ను బ్యాన్ చేసిన వైసీపీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల దగ్గరపడుతుండటంతో తమకు అనుకూలంగా ఉన్న ఛానెల్స్‌కు పార్టీల వైపు మొగ్గు చూపుతున్నాయి. అనుకూలంగా లేని.. ప్రత్యర్థి పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లు ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ ఛానెల్స్‌ను పక్కనపెట్టేస్తున్నాయి. అయితే అధికార పార్టీ అయిన టీడీపీకి.. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి, జనసేన పార్టీకి ఏయే ఛానెల్స్ అనుకూలంగా పని చేస్తున్నాయన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా.. ఇప్పటికే ఏబీఎన్-ఆంధ్రజ్యోతిని నిషేధిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగులో టాప్ ఛానెల్ అయిన టీవీ-5ను కూడా నిషేధిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
వైసీపీ ప్రకటన యథావిథిగా...
"తెలుగుదేశం పార్టీని నెత్తిన ఎత్తుకొని మోస్తున్న టీవీ–5 ఛానల్ చర్చలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ పాల్గొనకూడదని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో.. ‘తెలుగుదేశం పార్టీని భుజాన మోసే స్థితి నుంచి నెత్తికెక్కించుకుకుని వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేస్తున్న టీవీ–5 ఛానల్ చర్చలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఏ ఒక్కరూ పాల్గొనకూడదని పార్టీ నాయకులందరినీ ఆదేశించడమైనది. మా పార్టీ వారిని చర్చలకు ఆహ్వానించవద్దని టీవీ–5కు కూడా స్పష్టం చేస్తున్నాం. అలాగే, మొత్తంగా పార్టీ ప్రెస్మీట్లు, కార్యక్రమాల కవరేజీలో టీవీ–5ను నిషేదించడమైనది. స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది’. ఏబీఎన్‌ను నిషేధిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే" అని వైసీపీ నుంచి విడుదలైన ప్రకటనలో ఉంది. కాగా ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఇబ్బందికరమైనదేనని విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout