కౌలు రైతులకు "వైఎస్సార్ రైతు భరోసా" .. రేపటికి వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వారికి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్ట్ 31న జరగాల్సిన నిధుల విడుదల కార్యక్రమం అనివార్య కారణాలతో రేపటికి వాయిదా పడింది.
పంట సాగు చేసే వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులు ఒక్కొక్కరికి రూ.7500 చొప్పున.. రూ.109.74 కోట్లు సాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతులకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు.
రైతులకు ఆర్ధికంగా సాయం చేసేందుకు అక్టోబర్ 15, 2019 నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అర్హులైన భూ యజమానులకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలో రూ.7500.. అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఐదో ఏడాది తొలి విడతగా అందిస్తోన్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు.. 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు కలిపి మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లవుతుంది. మొత్తంగా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల సాయాన్ని అందించినట్లవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout