కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా .. రేపటికి వాయిదా

  • IndiaGlitz, [Thursday,August 31 2023]

దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వారికి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్ట్ 31న జరగాల్సిన నిధుల విడుదల కార్యక్రమం అనివార్య కారణాలతో రేపటికి వాయిదా పడింది.

పంట సాగు చేసే వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులు ఒక్కొక్కరికి రూ.7500 చొప్పున.. రూ.109.74 కోట్లు సాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతులకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు.

రైతులకు ఆర్ధికంగా సాయం చేసేందుకు అక్టోబర్ 15, 2019 నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అర్హులైన భూ యజమానులకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలో రూ.7500.. అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఐదో ఏడాది తొలి విడతగా అందిస్తోన్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు.. 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు కలిపి మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లవుతుంది. మొత్తంగా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల సాయాన్ని అందించినట్లవుతుంది.

More News

తండ్రీకొడుకులు పాదం మోపారు.. వరుణుడు పారిపోయాడు, సెంటిమెంట్ దెబ్బకు జనం గగ్గోలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు గుర్తుచేసుకుంటే.. ఆయన హైటెక్ పాలనతో పాటు వర్షాలు కూడా గుర్తొస్తాయి. దురదృష్టమో, శాపమో తెలియదు గానీ చంద్రబాబు రాష్ట్ర పగ్గాలు

రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితులు .. ఆ రెండు పాదాల మహిమే : ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. ఆగస్ట్ పోయి సెప్టెంబర్ వస్తున్నా నేటికి సరైన వర్షాలు లేవు. ఎల్ నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని

CM YS Jagan:జగన్‌పై అభిమానం చాటుకున్న విద్యార్ధులు.. రాఖీ ఆకారంలో ముఖ్యమంత్రిపై మమకారం

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా చెప్పుకునే రక్షాబంధన్ పర్వదినాన్ని భారతీయులు ఘనంగా జరుపుకుంటున్నారు.

Allu Arjun:అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ.. 'పుష్ప 2' లొకేషన్ పంచుకున్న ఐకాన్ స్టార్

జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Ntr100 Rupees:ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం ఫ్యాన్స్ క్యూ.. వేల కాయిన్స్ సేల్, మరిన్ని ముద్రించే పనిలో సర్కార్

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన సంస్మరణార్ధం రూ.100 నాణెం ముద్రించిన సంగతి తెలిసిందే.